E-Paper
Advertisement

హువావే నుంచి కళ్లుచెదిరే లగ్జరీ వాచ్ లాంచ్.. స్మార్ట్‌వాచ్ అంటే ఇలా కూడా ఉంటుందా?

హువావే నుంచి కళ్లుచెదిరే లగ్జరీ వాచ్ లాంచ్.. స్మార్ట్‌వాచ్ అంటే ఇలా కూడా ఉంటుందా?
Advertisement

Huawei Diamond Edition Watch: టెక్ ప్రపంచంలో లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హువావే.. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ సరికొత్త మాస్టర్ పీస్ Watch Ultimate Design Diamond Editionను చైనాలో విడుదల చేసింది. ఇప్పటికే రాయల్ ఎడిషన్‌తో టెక్ ప్రియులను అలరించిన హువావే.. ఈసారి అంతకు మించి అనేలా దీనిని వజ్రాల మెరుపులతో ముస్తాబు చేసి మార్కెట్లోకి వదిలింది. టెక్నాలజీకి రాయల్ లుక్ తోడైతే ఎలా ఉంటుందో ఈ వాచ్‌ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

వజ్రాల మెరుపుతో రాజసం..

ఈ వాచ్ డిజైన్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. దీని డయల్‌లో 12, 3, 6, 9 గంటల మార్కింగ్స్ దగ్గర మెరిసిపోయే వజ్రాలను అమర్చారు. కేవలం డయల్ మాత్రమే కాదు.. వాచ్ స్ట్రాప్‌లో కూడా అక్కడక్కడా డైమండ్స్‌ను అద్ది దీనికి ఒక గ్రాండ్ లుక్ ఇచ్చారు. వాచ్ కేసింగ్ మీద కూడా డైమండ్ కట్ డిజైన్ ఉండటంతో.. ఇది ఒక గ్యాడ్జెట్‌లా కాకుండా ఖరీదైన ఆభరణంలా కనిపిస్తోంది. పాత మోడల్స్‌లో ఉండే బటన్లకు బదులు, ఈసారి కొత్తగా డిజిటల్ క్రౌన్, పిల్‌షేప్ బటన్‌ను పరిచయం చేశారు.

Advertisement

Also Read: గేమర్ల కోసం OnePlus సరికొత్త ప్రయోగం.. ఈ ఫోన్ కొంటే గేమింగ్ కన్సోల్‌ను ఫ్రీగా పట్టుకెళ్లొచ్చు!

ఫీచర్లు మామూలుగా లేవు..

బయటికి చూడటానికి ఎంత రిచ్‌గా ఉందో, లోపల ఫీచర్లు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. దీనిలో ఉన్న 1.5 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ వల్ల మిరుమిట్లు గొలిపే ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికున్ eSIM సదుపాయంతో ఫోన్ దగ్గర లేకపోయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే హెల్త్ ట్రాకింగ్ కోసం ఈ వాచ్‌లో హెల్త్ గ్లాన్స్ ఫీచర్ కూడా ఉంది. ఇది కేవలం ఒక నిమిషంలోనే మన హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, స్ట్రెస్ వంటి 10 రకాల ఆరోగ్య సూచీలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

అడ్వెంచర్ ప్రియులకు పండగే..

Advertisement

సముద్ర గర్భంలో డైవింగ్ చేసేవాళ్లకి అయితే ఈ వాచ్ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే.. 150 మీటర్ల లోతు వరకు ఇది నీటిలో పనిచేస్తుంది. అంతేకాదు.. నీటి అడుగున ఉండి కూడా వేరే డైవర్లతో మాట్లాడుకోవడానికి దీనిలో సోనార్ బేస్డ్ మెసేజింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు. రన్నింగ్, సైక్లింగ్, గోల్ఫ్ ఆడేవారికి కావాల్సిన అన్ని రకాల ట్రాకింగ్ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. ఈ Watch Ultimate Design Diamond Edition గనుక ఇండియాలో విడుదలైతే.. దీని ధర రూ.3 లక్షల ఉండొచ్చని సమాచారం.

Also Read: భారీ బ్యాటరీ, ఐఫోన్ లాంటి డిజైన్.. సామాన్యుల కోసం టెక్నో పవర్‌ఫుల్ 5G మొబైల్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×