iFFALCON U65 65 inch 4K TV: ప్రస్తుత కాలంలో పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీల ట్రెండ్ నడుస్తోంది. ఇంట్లోనే.. కూర్చుని సినిమా థియేటర్ మజాను ఆస్వాదించాలనుకునే వారి కోసం కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో కూడిన టీవీలను బడ్జెట్ ధరలోనే లాంచ్ చేస్తున్నాయి.ఈ కోవకే చెందుతుంది ప్రముఖ టెక్ బ్రాండ్ ఐఎఫ్‌ఫాల్కన్ నుంచి వచ్చిన ఈ మోడల్ బెస్ట్. కేవలం రూ.39,999 ధరకే లభిస్తున్న ఈ బిగ్ స్క్రీన్ టీవీ ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన టీవీ అందించే ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టీవీ మెయిన్ అట్రాక్షన్ దీని భారీ 65 ఇంచుల డిస్‌ప్లే. 4K అల్ట్రా హెచ్‌డీ రెసల్యూషన్‌తో వస్తున్న ఈ స్క్రీన్ పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ప్రతి చిన్న అంశం స్పష్టంగా, అత్యంత సహజంగా కనిపిస్తుంది. మీరు సినిమాలు చూస్తున్నా.. లేదా వీడియో గేమ్స్ ఆడుతున్నా విజువల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.
సినిమా హాల్‌లో లభించే ఫీల్ ఇంటికి తీసుకు రావడంలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్‌తో.. వస్తుంది కాబట్టి కలర్స్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ రేషియో చాలా రిచ్‌గా ఉంటాయి. అలాగే.. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో.. కూడిన పవర్ ఫుల్ స్పీకర్లు రూమ్ అంతటా సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయి. దీని వల్ల ఎక్స్‌ట్రా హోమ్ థియేటర్ స్పీకర్లు అవసరం లేకుండానే.. అదిరి పోయే ఆడియో ఫీల్ సొంతం అవుతుంది.
మనం ఫాస్ట్ మూవింగ్ యాక్షన్ సీన్స్ లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు.. కొన్నిసార్లు పిక్చర్ బ్లర్ అవుతుంటుంది. కానీ..ఈ టీవీలో ఉన్న MEMCటెక్నాలజీ కారణంగా ఫాస్ట్ మూమెంట్స్ కూడా అత్యంత స్మూత్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి.స్పోర్ట్స్ లవర్స్‌కు, గేమింగ్ లవర్స్‌కు ఈ ఫీచర్ బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇది ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ టీవీ ఓఎస్ పై రన్ అవుతుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను నేరుగా యాక్సెస్ చేయెచ్చు. బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ వాయిస్ ద్వారానే.. టీవీని కంట్రోల్ చేయెచ్చు.హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్ దీని ప్రత్యేకతను మరింత పెంచుతుంది.
ఈ టీవీలో బ్లూటూత్, వై-ఫైతో పాటు హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా సెట్-టాప్ బాక్స్, లాప్‌టాప్, లేదా గేమింగ్ కన్సోల్స్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.ఈ అద్భుతమైన ఫీచర్లు అన్నీ కలిగిన ఈ స్మార్ట్ గూగుల్ టీవీ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుత ఆఫర్ల ప్రకారం దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే ఉంది.
పెద్ద స్క్రీన్, అదిరిపోయే.. 4K పిక్చర్ క్వాలిటీ, డాల్బీ సౌండ్ ,స్మార్ట్ ఫీచర్లు అన్నీ తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వారికి.. ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో.. బిగ్ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే.. ఈ టీవీని ధైర్యంగా ఎంచుకోవచ్చు!