Bigg Boss 10:బిగ్ బాస్ 46వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో ముఖేష్ (Mukhesh), శివ (shiva)మధ్య పర్సనల్ మాటల దాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ముఖేష్ ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మరి కామెంట్లు చేయడం, అటు లైలా మజ్ను కథలు అంటూ రెచ్చగొట్టడంతో వాటిని భరించలేక శివ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ముఖేష్ మాటలు అనడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి ? అసలేం జరిగింది? అనే విషయం ఎప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ లో ఉన్న 17 మంది కంటెస్టెంట్స్ ని మూడు భాగాలుగా డివైడ్ చేశారు బిగ్ బాస్. అందులో వారి ఆట తీరు, ఆడియన్స్ ఓటింగ్ను బట్టి డివైడ్ చేశారు . అందులో రెడ్ లెవెల్, ఎల్లో లెవెల్, గ్రీన్ లెవెల్ అంటూ మూడు లెవెల్స్ ను డివైడ్ చేశారు. ఇందులో గ్రీన్ లెవెల్ పొందిన వారికి బిగ్ బాస్ నుండి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇకపోతే రెడ్ లెవెల్ లో ఉన్నవారికి టాస్క్ నిర్వహించగా అందులో గెలిచిన రాంప్రసాద్ ఎల్లో లెవెల్ లోకి వెళ్లారు . ఇక ఎల్లో లెవెల్ లో ఉన్నవారికి టాస్క్ నిర్వహించారు. ఇక ఉదయం వదిలిన మొదటి ప్రోమోలో ఆ బరువులు మోయలేక శివ, వర్షిని కింద పడిపోయారు. వర్షిని అయితే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోవడం మనం ప్రోమోలో చూడవచ్చు. బరువులు మోయలేనని కన్నీళ్లు పెట్టుకున్నా ..రామకృష్ణ కనికరం లేకుండా బరువును వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో నీతు మాస్టర్ గట్టిగానే ప్రయత్నం చేసింది . కానీ ఎక్కువ బరువు ఆమెకు వేయడం వల్ల ఆమె మోయలేక వాటిని కింద పడేసింది. ఇక త్రిగుణ్ కి కూడా అంతే వెయిట్ ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ శాలిని బరువు ఉన్న బ్యాగులు జోడించినప్పటికీ అంతే పాజిటివ్ గా తీసుకోవడం అందరిని ఆకట్టుకుంది. తర్వాత ముఖేష్ కి శివ ఒకే సైడు 12 కేజీల బరువున్న సంచులు తగిలించాడు. తర్వాత ముఖేష్ కి వరుసగా బ్యాగులు తగిలించేసరికి మోయలేక కింద పడేసాడు ఇక శివా దగ్గరకు వచ్చి నీకు అవకాశం వచ్చినప్పుడు.. బ్యాలెన్స్ గానే సంచులు తగిలించారు కదా మరి నాకెందుకు ఒక సైడే అంత బరువు వేశావు అంటూ ప్రశ్నించాడు ముఖేష్. అంతటితో ఆగకుండా నువ్వు టార్గెట్ చేసి అటాక్ చేస్తావు.. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అన్నావు కదా.. నీ గురించి కూడా నాకు తెలుసు. నీ బయట విషయం నాకు కూడా తెలుసు. లైలా మజ్ను బిల్డప్ తీసుకోకు ఇక్కడ అంటూ ముఖేష్ కామెంట్లు చేశారు.
also read:‘నల్లమల’ డైరెక్టర్ రవి చరణ్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వారే టార్గెట్ గా!
ఇక శివ ఇంత టార్గెట్ చేస్తారా మనుషులను.. ఓడిపోయినప్పుడు నేను ఒక్క మాటైనా అన్నానా? వేరే వాళ్లకు 22 ఉంటే నాకు 32 కేజీల బరువు ఉంది. నేను ఏ రోజు పర్సనల్ అటాక్ చేయలేదు అంటూ శివ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికైతే టాస్క్ కాస్త బయట విషయాలను తీసుకొస్తూ ఏకంగా పర్సనల్ అటాక్ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.