E-Paper
Advertisement

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ.. ఫస్ట్ ఫోస్టు ఇదే

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ..  ఫస్ట్ ఫోస్టు ఇదే
Advertisement

Sonia Gandhi: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర అగ్రనాయకురాలు సోనియా‌గాంధీ సోషల్ మీడియా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వేదికపై ఆమె తొలి పోస్టు పెట్టారు. విడుదల కానున్న ఆత్మకథ (బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌) కు కొన్ని సన్నివేశాలు షేర్ చేశారు.

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఇన్‌స్టాలో అడుగుపెట్టారు. గురువారం ఇన్‌స్టాలో ఖాతా తెరిచిన ఆమె, త్వరలో విడుదల కానున్న ఆత్మకథ గురించి కొన్ని దృశ్యాలు షేర్ చేశారు. ‘బిలాంగింగ్.. ఏ జర్నీ ఆఫ్ లవ్’ Belonging: A Journey of Love కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. లైబ్రరీలో కూర్చుని పుస్తకాల పేజీలను తిరగేస్తూ పాత ఫొటోలను చూస్తూ ప్రియాంకా గాంధీతో నవ్వుతూ ముచ్చటిస్తున్న వీడియో పోస్ట్ చేశారు.

Advertisement

ఆ క్షణాలను అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. ప్రేమ, బాధ్యత, నష్టం, మనకంటూ ఒక చోటును వెతుక్కునే కథ అని రాసుకొచ్చారు. ఇన్‌స్టాలో అడుగుపెట్టిన కొద్ది గంటల్లో ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు. అయితే సోనియాగాంధీ కేవలం ముగ్గుర్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీ మాత్రమే ఉన్నాయి.

ముగ్గుర్ని ఫాలో అవుతున్న సోనియా

రాహుల్‌కు 16.3 మిలియన్లు, పార్టీకి 15.9 మిలియన్లు, ప్రియాంకకు 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోనియా ఎప్పుడూ ఎక్స్, ఫేస్‌బుక్‌లో చేరలేదు. ఈ పుస్తకంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్-చైనాతో సరిహద్దుకు సంబంధించిన కొన్ని అంశాలను తొలగించాలని పబ్లిషర్ పై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. నవంబర్ 10న ఈ పుస్తకం మార్కెట్‌లోకి రాబోతోంది.

Advertisement

1965 కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల సోనియా-రాజీవ్ గాంధీ ప్రేమలో పడటంతో మొదలవుతుంది. యుద్ధానంతర వెనెటోలో ఆమె బాల్యం గురించి వస్తుంది. ప్రచురణ కర్త పరిచయం ప్రకారం.. తన అత్త ఇందిరాగాంధీని కలుస్తారు. హిందీ నేర్చుకోవడం, చీరలు కట్టుకుని భారతీయ ఆహారంపై అభిరుచిని పెంచుకుంటారు. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత రాజీవ్ ప్రధానమంత్రి అయ్యారు. ఏడు సంవత్సరాల తర్వాత ఆయన కూడా హత్యకు గురయ్యారు.

ALSO READ: వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

?utm_source=ig_embed&ig_rid=Aj6Neu72fFjNwJUJQ0HN3of

 

Related News

వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

భార్య తల నరికి త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజ, బెంగాల్‌లో గగుర్పొడిచే ఘటన

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

Big Stories

Advertisement
×