E-Paper
Advertisement

Induction Stove Buying Tips: ఇండక్షన్ స్టవ్ కొనేముందు ఇవి చెక్ చేసుకోండి.. లేకపోతే కరెంట్ బిల్లు వాచిపోద్ది

Induction Stove Buying Tips: ఇండక్షన్ స్టవ్ కొనేముందు ఇవి చెక్ చేసుకోండి.. లేకపోతే కరెంట్ బిల్లు వాచిపోద్ది
Advertisement

Induction Cooktop Buying Tips| గత కొంత కాలంగా దేశంలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల (స్టవ్‌లు) ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా వంట గ్యాస్ (LPG) సిలిండర్ల పంపిణీ ఆలస్యం, ధరల పెరుగుదల వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ కుకింగ్ పరికరాల వైపు మొగ్గుచూపుతున్నారు. పైగా ఇండక్షన్ కుక్‌టాప్‌లు వేగంగా వంట చేస్తాయి, కిచెన్‌ అందాన్ని పెంచుతాయి. కానీ ఇండక్షన్ స్టవ్‌లు కొనేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోకపోతే విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు సమయంలో ఏ విషయాలు గమనించాలనేది కీలకం.

పవర్ రేటింగ్ జాగ్రత్తగా చూడాలి

ఇండక్షన్ కుక్‌టాప్ కొనే సమయంలో దాని పవర్ రేటింగ్ చాలా ముఖ్యం. చాలా మంది ఈ విషయం పట్టించుకోకుండా కొనేస్తున్నారు. తర్వాత విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తుంది. సాధారణంగా 1200 వాట్స్ నుంచి 2000 వాట్స్ వరకు పవర్ రేటింగ్ ఉంటుంది. తక్కువ వాట్స్ ఉంటే విద్యుత్ తక్కువ వినియోగమవుతుంది. కానీ వంట కాస్త ఆలస్యమవుతుంది. ఎక్కువ వాట్స్ ఉంటే స్టవ్ వేగంగా వేడెక్కుతుంది. కానీ విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరు రోజూ ఎంత వంట చేస్తారో దాని ఆధారంగా ఎంచుకోవాలి.

మీ వంటగది సైజు చూసుకొని కొనాలి

Advertisement

కిచెన్‌లో ఎంత స్థలం ఉందో కొలిచి చూడకుండా ఇండక్షన్ కుక్‌టాప్ కొంటే తర్వాత ఇబ్బంది పడవచ్చు. చాలా మోడల్స్ సింగిల్ బర్నర్ డిజైన్‌లో ఉంటాయి. కొన్ని డ్యూయల్ బర్నర్ ఆప్షన్ కూడా ఇస్తాయి. మీ కిచెన్ కౌంటర్ స్థలం ప్రకారం సరైన సైజు ఎంచుకోవాలి. సరైన సైజు ఉంటే కిచెన్‌లో సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

టెంపరేచర్, పవర్ కంట్రోల్స్

మంచి ఇండక్షన్ కుక్‌టాప్‌లో టెంపరేచర్, పవర్ కంట్రోల్స్ ఉండాలి. ఇవన్నీ బాగుంటే వివిధ కుకింగ్ మోడ్స్ ఉపయోగించవచ్చు. బాయిల్ చేయడం, ఫ్రై చేయడం, సిమ్మర్ చేయడం సులభంగా చేయవచ్చు. వంట కాలిపోకుండా లేదా ఎక్కువ ఉడికిపోకుండా కంట్రోల్ సెట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఉంటే వంట చేసే సమయంలో ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

సేఫ్టీ ఫీచర్లను కచ్చితంగా చూడాలి

Advertisement

ఎలక్ట్రిక్ ఉపకరణాల్లో భద్రతా ఫీచర్లు చాలా ముఖ్యం. ఓవర్‌హీటింగ్ అయితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్ ఉండాలి. చైల్డ్ లాక్ ఉంటే పిల్లలు యాక్సిడెంటల్‌గా ఆన్ చేయలేరు. పాన్ డిటెక్షన్ టెక్నాలజీ ఉంటే సరైన పాత్ర ఉంటేనే వేడి అవుతుంది. ఈ సేఫ్టీ ఫీచర్లు యూజర్లను రక్షిస్తాయి, పరికరం ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది.

Also Read: గ్యాస్, కరెంట్ ఏదీ అవసరం లేకుండానే వంట చేసేయండి.. కొత్త స్టవ్ చూశారా?

నమ్మకమైన బ్రాండ్, సర్వీస్ సపోర్ట్

ఇండక్షన్ కుక్‌టాప్ కొనేటప్పుడు అది నమ్మకమైన బ్రాండ్ అని చూసి కొనాలి. నమ్మకమైన బ్రాండ్‌లు మంచి క్వాలిటీ, డ్యూరబిలిటీ ఇస్తాయి. వారంటీ, సర్వీస్ సపోర్ట్ బాగుంటాయి. సమస్య వచ్చినప్పుడు త్వరగా సరిచేస్తారు. వారంటీ కండీషన్స్ ముందుగా పరిశీలించాలి. కస్టమర్ రివ్యూలు కూడా మంచి బ్రాండ్ ఎంచుకోవడానికి సహాయపడతాయి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×