E-Paper
Advertisement

Romantic Comedy Drama : 30 సంవత్సరాల తరువాత ఓటీటీలోకి హాలీవుడ్ హిట్ మూవీ సీక్వెల్‌… ఫ్యామిలీ ఎమోషన్స్ తో

Romantic Comedy Drama : 30 సంవత్సరాల తరువాత ఓటీటీలోకి హాలీవుడ్ హిట్ మూవీ సీక్వెల్‌… ఫ్యామిలీ ఎమోషన్స్ తో
Advertisement

Romantic Comedy Drama OTT : ఓటీటీలోకి 30 సంవత్సరాల తరువాత ఒక ఫ్యామిలీ మూవీకి సీక్వెల్‌ వచ్చింది. 1 గంట 52 నిమిషాల నిడివితో ఈ సినిమా చూపుతిప్పుకోనివ్వదు. ఎడ్వర్డ్ బర్న్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మూడు దశాబ్దాల తర్వాత 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఓటీటీలో అన్నిరకాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ది ఫ్యామిలీ మెక్‌ములెన్’ (The Family McMullen). 2025లో విడుదలైన ఈ సినిమా ఎడ్వర్డ్ బర్న్స్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది 1995లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ది బ్రదర్స్ మెక్‌ములెన్’ (The Brothers McMullen) కు సీక్వెల్. మొదటి భాగంలో యువకులుగా ఉన్న అన్నదమ్ములు, 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు 50 ఏళ్ల వయసులో తమ పిల్లలతో కలిసి ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలు, ప్రేమలు, బంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎడ్వర్డ్ బర్న్స్ (బారీ), మైఖేల్ మెక్‌గ్లోన్ (పాట్రిక్), కొన్నీ బ్రిట్టన్ (మోలీ) వంటి అప్పటి అసలు నటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం JioHotstarలో 2026 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముప్పై ఏళ్ల క్రితం ‘ది బ్రదర్స్ మెక్‌ములెన్’ సినిమాలో కుర్రాళ్లుగా సందడి చేసిన ఆ అన్నదమ్ములు, ఇప్పుడు 50 ఏళ్ల వయసులో తమ పిల్లలతో కలిసి పడుతున్న ఇబ్బందులే ఈ సినిమా కథ. ఇప్పుడు ప్రధాన పాత్ర అయిన బారీ మెక్‌ములెన్ భార్యతో విడిపోయి, తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో, అతని కూతురు ప్యాటీ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, పెళ్లి వద్దంటూ తండ్రి ఇంటికి తిరిగి వస్తుంది. అదే సమయంలో బారీ కొడుకు కూడా ఒక ఆమ్మాయి ప్రేమలో పడి కొత్త సమస్యలు తెచ్చుకుంటాడు.

ఇక బారీ తమ్ముడు పాట్రిక్ పరిస్థితి మరోలా ఉంటుంది. పిల్లలందరూ పెరిగి పెద్దయి ఇళ్లు వదిలి వెళ్లిపోయాక, అతని భార్య అతనికి విడాకులు ఇచ్చేస్తుంది. దాంతో ఒంటరివాడైన పాట్రిక్ కూడా వచ్చి అన్న ఇంట్లోనే చేరతాడు. వీరికి తోడుగా మోలీ అనే మహిళ కూడా వచ్చి చేరడంతో, ఒకే ఇంట్లో రెండు తరాల వాళ్ళు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక స్టోరీ పాత తరం మనుషులు, కొత్త తరం పిల్లల ప్రేమల మధ్యలో వచ్చే మనస్పర్థలతో కథ సరదాగా సాగుతుంది. ఎన్ని గొడవలు ఉన్నా, కష్టకాలంలో కుటుంబమే అండగా నిలుస్తుందనే ఎమోషన్ తో ఈ సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×