E-Paper
Advertisement

Induction Stove: గ్యాస్ కంటే చౌకగా ఇండక్షన్‌పై వంట.. గంట వాడితే ఎంత ఖర్చవుతుందంటే ?

Induction Stove: గ్యాస్ కంటే చౌకగా ఇండక్షన్‌పై వంట.. గంట వాడితే ఎంత ఖర్చవుతుందంటే ?
Advertisement

Induction Stove: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో గ్యాస్ స్టవ్‌తో పాటు ఇండక్షన్ స్టవ్ కూడా వాడకం పెరిగింది. వేగంగా వంట చేయడం, సురక్షితంగా ఉండడం వంటి కారణాల వల్ల దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే.. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇండక్షన్ స్టవ్‌ను గంటపాటు వాడితే ఎంత కరెంట్ ఖర్చవుతుంది? దాంతో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా? అనే ప్రశ్నలు కూడా వస్తుంటాయి. నిజానికి ఇండక్షన్ స్టవ్ ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసుకుంటే ఖర్చు గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇండక్షన్ స్టవ్- కరెంట్ ఖర్చు:
ఇండక్షన్ స్టవ్ కరెంట్‌తో పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే అయితే. ఇది మంట లేకుండా మాగ్నెటిక్ టెక్నాలజీ ద్వారా పాత్రను వేడి చేసి వంట చేస్తుంది. అందుకే వంట చాలా వేగంగా అవుతుంది. సాధారణంగా మార్కెట్‌లో.. ఉండే ఇండక్షన్ స్టవ్‌లు 1200 వాట్స్ నుంచి 2000 వాట్స్ వరకు పవర్ ఉపయోగిస్తాయి. కొన్ని మోడళ్లలో పవర్‌ను మన అవసరానికి అనుగుణంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

Advertisement

గంట వాడితే ఎంత కరెంట్ ఖర్చవుతుంది?
సాధారణంగా 1000 వాట్స్ పవర్ ఒక గంట పని చేస్తే దాన్ని ఒక యూనిట్ కరెంట్‌గా లెక్కిస్తారు. అదే విధంగా 2000 వాట్స్ ఇండక్షన్ స్టవ్ గంట పాటు పని చేస్తే సుమారు 2 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. అయితే వాస్తవానికి ఇండక్షన్ స్టవ్ ఎప్పుడూ పూర్తి పవర్‌తో పనిచేయదు. వంట మధ్యలో పవర్ తగ్గుతూ ఉంటుంది. అందుకే సాధారణంగా ఒక గంట వాడితే సుమారు 1 నుంచి 1.5 యూనిట్ల వరకు కరెంట్ ఖర్చవుతుంది.

కరెంట్ బిల్లు ఎంత వస్తుంది?
ఒక యూనిట్ కరెంట్ ధర సుమారు రూ. 6 నుంచిరూ. 8 వరకు ఉంటుంది. ఇది రాష్ట్రాన్ని బట్టి కొంచెం మారవచ్చు. అంటే ఒక గంట ఇండక్షన్ స్టవ్ వాడితే సుమారు రూ.7 నుంచి రూ.11 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇండక్షన్ వాడటం వల్ల కరెంట్ బిల్లు చాలా ఎక్కువగా వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు.

Advertisement

Also Read: సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో వంట చేసేయండి!

ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల లాభాలు:
ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వంట చాలా వేగంగా పూర్తవుతుంది. గ్యాస్ అవసరం తగ్గుతుంది. మంట లేకపోవడం వల్ల ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. అలాగే శుభ్రం చేయడం కూడా చాలా సులభం. అందుకే ఇప్పుడు చాలా కుటుంబాలు ఇండక్షన్ స్టవ్‌ను రోజువారీ వంట తయారీలో ఉపయోగిస్తున్నారు.

కరెంట్ ఖర్చు తగ్గించుకోవడానికి చిట్కాలు:
ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. కరెంట్ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇండక్షన్‌కు సరిపోయే గిన్నెలు మాత్రమే వాడడం మంచిది. పాత్ర కింద భాగం సరిగా ఉండాలి. అవసరం లేని సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగే ఖాళీ పాత్రను ఎక్కువసేపు వేడి చేయకూడదు. ఈ విధంగా వాడితే కరెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఇండక్షన్ స్టవ్‌ను గంటపాటు వాడితే సాధారణంగా 1 నుంచి 1.5 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. సరైన విధంగా వాడితే ఇది గ్యాస్‌కు మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు చాలా మంది తమ వంటగదిలో ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×