E-Paper
Advertisement

Biogas Business: ఇదే సరైన సమయం.. గ్యాస్ ఉత్పత్తితో బోలెడంత సంపాదన.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

Biogas Business: ఇదే సరైన సమయం.. గ్యాస్ ఉత్పత్తితో బోలెడంత సంపాదన.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Advertisement

Biogas Business: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో ఎల్పీజీ గ్యాస్ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు రావడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో LPGకి ప్రత్యామ్నయంగా బయో గ్యాస్ మారుతోంది. అయితే ఈ బయో గ్యాస్ ను ఎవరైనా ఇంటి దగ్గర నుండే తయారు చేయవచ్చు. దీనికోసం ప్రత్యేక పథకాలు ప్రారంభించి మరి.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. ప్రస్తుత సమయంలో డబ్బు సంపాదనకు బయో గ్యాస్ అద్బుతమైన మార్గంగా నిలవబోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బయో గ్యాస్ తయారీ? దేశంలో దానికున్న డిమాండ్? కేంద్రం ఆర్థిక సాయం? గ్యాస్ అమ్ముకొని డబ్బు సంపాదించే మార్గాలు? ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఇంట్లోనే బయో గ్యాస్ తయారీ విధానం

బయో గ్యాస్‌ను ప్రాథమికంగా ఆవు పేడ, వంటగది వ్యర్థాలు (కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం) నీటితో తయారు చేయవచ్చు. ముందుగా పేడ, నీటిని 1:1 నిష్పత్తిలో కలిపి ఒక మిశ్రమంలా (Slurry) చేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని ఒక ట్యాంకులో వేయాలి. ఇక్కడ బ్యాక్టీరియా వల్ల వ్యర్థాలు కుళ్లి మిథేన్ వాయువు విడుదలవుతుంది. ట్యాంకు పైన ఒక పైపు అమర్చి దాన్ని నేరుగా వంట స్టవ్‌కు అనుసంధానించవచ్చు. గ్యాస్ విడుదలైన తర్వాత మిగిలే వ్యర్థం (Slurry) పంటలకు అద్భుతమైన ఆర్గానిక్ ఎరువుగా ఉపయోగపడుతుంది.

కేంద్రం ఆర్థిక సాయం (Subsidies)

Advertisement

బయో గ్యాస్ ను ఉత్పత్తి చేసే వారికి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ కింద భారత ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE).. ఈ సబ్సిడీలను అందిస్తోంది. చిన్న ప్లాంట్ల (1-25 క్యూబిక్ మీటర్లు) సామర్థ్యాన్ని బట్టి రూ.9,800 నుండి రూ.14,350 వరకు కేంద్రం సాయం చేస్తోంది. అదే ఈశాన్య రాష్ట్రాలు, ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి అంతకంటే ఎక్కువ సబ్సిడీ లభించనుంది.

వాణిజ్య ప్లాంట్లకు భారీ సాయం

వాణిజ్యపరంగా బయో-సీఎన్‌జీ ప్లాంట్లు పెట్టే వారికి 4,800 కిలోల ఉత్పత్తి సామర్థ్యంపై సుమారు రూ.4 కోట్ల వరకు కేంద్ర ఆర్థిక సాయం (CFA) లభిస్తుంది. దీని కోసం కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు ‘సతత్’ (SATAT) పథకం కింద రుణాలు అందిస్తున్నాయి. భారీ మెుత్తంలో ప్లాంట్లు పెట్టే వారికి కేంద్రం నుంచి అంతే స్థాయిలో ఆర్థిక సాయం లభించనుంది.

ఆర్థిక లాభాలు – వ్యాపార అవకాశాలు

Advertisement

బయో గ్యాస్ ద్వారా మీరు రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు. ఇంటి అవసరాలకు వాడటం ద్వారా నెలకు కనీసం రూ.1,000 – రూ1,200 (సిలిండర్ ధర) వరకూ ఆదా అవుతుంది. అలాగే ప్లాంట్ నుండి వచ్చే ‘లిక్విడ్ స్లర్రీ’ని సేంద్రియ ఎరువుగా అమ్మవచ్చు. దీనికి మార్కెట్లో కిలోకు మంచి ధర పలుకుతుంది. మీరు పెద్ద ఎత్తున ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. శుద్ధి చేసిన గ్యాస్‌ను (Compressed Biogas) హోటళ్లకు లేదా సిలిండర్లలో నింపి స్థానిక పరిశ్రమలకు విక్రయించవచ్చు. దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) లేదా బయో-సీఎన్జీ ధర సాధారణంగా కిలోకు రూ.62 – రూ.72 మధ్య ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మీ బయోగ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.1,00,000 – 1,50,000 వరకూ సంపాదించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!

మార్కెట్‌లో బయోగ్యాస్ డిమాండ్

ప్రస్తుతం దేశీయ బయో గ్యాస్ మార్కెట్.. 20 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి సీఎన్‌జీ (CNG) నెట్‌వర్క్‌లో 1% బయో గ్యాస్ కలపడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల బయోగ్యాస్ కు మార్కెట్ లో డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో.. రవాణా, పారిశ్రామిక రంగాల్లో బయో గ్యాస్ వాడకం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీగా బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.

Also Read: Jio 90 Days Plan: జియో మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్.. 3 నెలల పాటు.. ఫ్రీ ఓటీటీలు, రోజూ 3GB డేటా!

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×