Actor Rajasekhar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రాజశేఖర్(Rajashekhar) ఒకరు. ఈయన ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగిన రాజశేఖర్ ఇటీవల కాలంలో సినిమాలను చాలా వరకు తగ్గించారని చెప్పాలి. ఇక ఈయన చాలా రోజుల తర్వాత శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న బైకర్ (Biker)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
అభిలాష రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం బైకర్. ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు .ఈ ట్రైలర్ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న రాజశేఖర్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. ఇకపై వచ్చే సినిమాలలో నాకు కూడా అవకాశాలు కల్పించండి అని ఈయన కోరుకున్నారు. ఇన్ని రోజులు తాను కెరియర్ పరంగా సెకండ్ స్టేజ్ కి(సెకండ్ హీరోగా) వచ్చానని అనుకున్నాను. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంలో తన ఇద్దరి కూతుర్లు ఇండస్ట్రీలో అలాంటివేమీ లేవని చెప్పడంతో తాను బైకర్ సినిమాలో నటించానని ఇకపై ఎక్కువ సినిమాలలో నన్ను తీసుకోండి అంటూ రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా కెరియర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇకపై రాజశేఖర్ కు వరుస సినిమా అవకాశాలు వస్తాయనే చెప్పాలి.
గోటీల ఫ్యాక్టరీతోనే బైకర్ ఫైనాన్స్..
ఇక బైకర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తనని సెకండ్ హీరో లాగా ట్రీట్ చేశారని ఇక శర్వానంద్ అయితే నేనే హీరో అనేలా చూసుకున్నారని రాజశేఖర్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ తన గోటీల ఫ్యాక్టరీ గురించి కూడా మరోసారి మాట్లాడారు గోటిల ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన డబ్బుతోనే బైకర్ సినిమాకు ఫైనాన్స్ చేశాను అంటూ ఈయన చమత్కరించారు. ఈ సినిమాలో సునీల్ అనే పాత్రలో రాజశేఖర్ పాత్ర అందరికీ బాగా గుర్తుండిపోతుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. హాలీవుడ్ విజువల్స్ తో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే శర్వా మరో హిట్ కొట్టబోతున్నారనే చెప్పాలి.
Also Read: Sreeleela: సినిమాలకు శ్రీలీల గుడ్ బై…షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటి..అదే కారణమా?