E-Paper
Advertisement

Gas Saving Tips: గ్యాస్ కొరత వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. నెల వచ్చే గ్యాస్ 3 నెలల వస్తుంది!

Gas Saving Tips: గ్యాస్ కొరత వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. నెల వచ్చే గ్యాస్ 3 నెలల వస్తుంది!
Advertisement

Gas Saving Tips: ప్రస్తుతం దేశంలో ప్రతీ ఒక్కరినీ గ్యాస్ కొరత వేధిస్తోంది. గ్యాస్ ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికో గాని డెలివరీ కావడం లేదన్న ఆరోపణలు సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ ను ఆదా చేసుకోవడం ద్వారా.. ఎక్కువ రోజులు వంటకు సమస్య లేకుండా చేసుకోవచ్చు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ ను 30-60 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగానే రెడీగా ఉండండి

సాధారణంగా చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వంట మెుదలు పెట్టిన తర్వాత కూరగాయాలు కోయడం, వంట పాత్రలు వెతకడం వంటివి చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల గ్యాస్ వృథాగా పోయే అవకాశముంది. కాబట్టి స్టవ్ వెలిగించే ముందే కావలసిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉంచుకుంటే గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు.

సరైన పాత్రలను ఎంచుకోండి

Advertisement

వంట పాత్రలపై కూడా గ్యాస్ ఖర్చు ఆధారపడి ఉంటుంది. కాబట్టి వంట చేసేందుకు వెడల్పాటి, మూత ఉన్న గిన్నెలను ఎంచుకోండి. గిన్నెపై మూత పెట్టి వండటం వల్ల ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. అలాగే పాత్ర అడుగు భాగం మంట కంటే పెద్దదిగా ఉండేలా జాగ్రత్త వహించండి. దీనివల్ల గ్యాస్ పక్కలకు వెళ్లి వృథా అయ్యే అవకాశం తగ్గుతుంది.

ఆహారాన్ని నానబెట్టడం

బియ్యం, పప్పులు లేదా శనగలు వంటి వాటిని వండటానికి కనీసం 30 నిమిషాల ముందే నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది. తద్వారా గ్యాస్ ను ఎక్కువ రోజులు వాడకంలో ఉంచుకోవచ్చు.

తక్కువ మంటతో కుకింగ్

Advertisement

వంటపాత్రలోని నీరు లేదా పులుసు బాగా మరుగుతున్న దశలో మంటను కాస్త తగ్గించండి. సాధారణంగా ఎక్కువ మంట ఉంటే ఆహారం త్వరగా ఉడకగపోగా గ్యాస్ వృథా అవుతుంది. దీనికి మంట ఎక్కువ ఉండటం వల్ల ఆహారపదార్థాలు తమ రుచిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సిమ్‌లో ఉంచి వండటం వల్ల గ్యాస్ ను సేవ్ చేసుకోవడంతో పాటు పోషకాలను కోల్పోకుండా కాపాడుకోవచ్చు.

Also Read: Gas Saving Tips: గ్యాస్‌ను ఆదా చేసే.. టాప్-5 వంటకాలు.. రుచికి రుచి ఆదాకి ఆదా!

లీకేజీలు, బర్నర్ క్లీనింగ్

గ్యాస్ పైపులు లేదా రెగ్యులేటర్ దగ్గర లీకేజీలు లేకుండా చూసుకోండి. అలాగే స్టవ్ బర్నర్ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగ్గా రాదు. కాబట్టి బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల నీలం రంగు మంట వస్తుంది. ఇది సమర్థవంతంగా ఆహారాన్ని వండటానికి దోహదం చేస్తుంది.

Also Read: Vistadome Train Experience: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×