E-Paper
Advertisement

Infinix GT 20 Pro: స్టైలిష్ డిజైన్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి గేమింగ్ ఫోన్ లాంచ్..!

Infinix GT 20 Pro: స్టైలిష్ డిజైన్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి గేమింగ్ ఫోన్ లాంచ్..!
Advertisement

Infinix GT 20 Pro Design: Infinix GT సిరీస్ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ GT 10 Pro  సక్సెసర్‌గా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సౌదీ అరేబియాలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది వారాల్లో దీనిని భారతదేశంతో పాటు ఇతర మార్కెట్లలో కూడా విడుదల చేయవచ్చు. గేమర్స్ కోసం శక్తివంతమైన చిప్‌సెట్‌‌ను ఫోన్‌లో తీసుకొచ్చారు. ఇది MediaTek Dimension 8200 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఫోన్‌కు 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 mAh బ్యాటరీ అందుబాటులో ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్లు తదితర విషయాలను తెలుసుకోండి.

Infinix GT 20 Pro సైబర్ మెకా డిజైన్‌తో కూడిన లుక్స్ ఇస్తుంది. ఇది సౌదీ అరేబియాలో రెండు స్టోరేజ్ ఆప్షన్లలో తీసుకొచ్చారు. అవి 8GB + 256GB, 12GB + 256GB. దీన్ని Mecha Silver, Mecha Blue  Mecha Orange రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌లో OISతో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్  మరొక 2MP సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం కంపెనీ 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది.

Advertisement

Also Read: లిమిటెడ్ డీల్.. రూ.5,299లకే స్మార్ట్‌ఫోన్

Infinix స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED స్క్రీన్‌ను స్లిమ్ బెజెల్స్‌తో కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, 1100 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 94.3. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్‌లో MediaTek Dimension 8200 Ultimate చిప్‌సెట్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది LPDDR5x RAM, UFS 3.1స్టోరేజ్‌తో ఉంటుంది. ఇందులో గేమింగ్ కోసం ప్రత్యేక చిప్ కూడా ఉంది. ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. గేమ్ ఆప్టికల్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ ఫోన్‌లో ఉపయోగించబడింది.

Advertisement

Also Read: జాతరే జాతర.. రూ. 8 వేలకే వివో న్యూ 5G స్మార్ట్‌ఫోన్లు!

GT 20 Proలో 5,000 mAh బ్యాటరీని ఉంటుంది. ఇది 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో హైపర్ ఛార్జ్ మోడ్, బైపాస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఫోన్ GT-ఆధారిత Android 14 నుండి XOS 14పై నడుస్తుంది. కంపెనీ రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను అప్‌డేట్ ఇస్తుంది.

Tags

Related News

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషిన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

Big Stories

Advertisement
×