BigTV English

Chandrababu: నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు: చంద్రబాబు

Chandrababu: నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు: చంద్రబాబు

Chandrababu: గడిచిన ఐదేళ్లో రాష్ట్రంలోని వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు రాష్ట్రంలో ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు.


నెల్లూరులోని షాద్ మంజిల్ లో ముస్లింలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని వెల్లడించారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలని.. జగన్ పాలనలా మాత్రం ఉండకూడదన్నారు.

స్వార్థం కోసం దోపిడి చేసి మోసం చేస్తే అటువంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబు వారికి గుర్తు చేశారు.


టీడీపీ హజ్ హౌస్ లను నిర్మించి పలువురిని మక్కా మసీదుకు పంపించామని తెలిపారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ లను ముస్లింల కోసం ప్రత్యేకంగా నిర్మించామని వెల్లడించారు. రూ.8 కోట్లు ఖర్చు చేసి షాదీ మంజిల్ కట్టించామన్నారు. రెట్టెల పండుగను కూడా టీడీపీనే రాష్ట్రంలో నిర్వహించిందని వెల్లడించారు. అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా టీడీపీనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ క్విడ్ ప్రోకో!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా కట్టించిందా అంటూ ప్రశ్నించారు. ముస్లింలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుందని విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయంటూ మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజలు కిడ్నీలు పాడై చనిపోతున్నారని ఆరోపించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×