E-Paper
Advertisement

Infinix New Smartphone: అన్నొస్తున్నాడు.. ఇన్ఫినిక్స్ నెక్స్ట్ లెవల్ ఫోన్.. నమ్మండి రా బాబు!

Infinix New Smartphone: అన్నొస్తున్నాడు.. ఇన్ఫినిక్స్ నెక్స్ట్ లెవల్ ఫోన్.. నమ్మండి రా బాబు!
Advertisement

Infinix New Smartphone: టెక్ మేకర్ ఇన్ఫినిక్స్ తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 40s 4G మొబైల్‌ని తీసుకురానుంది. అయితే ఇప్పుడు లాంచ్ చేయడానికి ముందే ఫోన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కంపెనీ అధికారిక సైట్‌లో పూర్తి స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం నోట్ 40s 4G డిజైన్, స్పెసిఫికేషన్‌లు నోట్ 40, నోట్ 40 ప్రోల మాదిరిగానే ఉంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఫోన్‌లో ప్రాసెసర్‌గా MediaTek Helio G99 అల్టిమేట్ చిప్ ఉంది. ఇదే ప్రాసెసర్ నోట్ 40లో కూడా ఉంటుంది. నోట్ 40, నోట్ 40 ప్రోలో ఉన్న మూడు కెమెరా సెన్సార్‌లతో పోలిస్తే నోట్ 40ఎస్ 4జీ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. కాబట్టి నోట్ 40ఎస్ 4జీలో కెమెరా సెటప్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. అయితే మెయిన్ 108MP సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉంటాయి. ఫోన్‌లో ఫాన్సీ హాలో AI లైటింగ్ రింగ్ కూడా ఉంది. ఇది నోటిఫికేషన్‌లు, కాల్‌లు, ఛార్జింగ్, ఇతర ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

ఫోన్‌ 8GB RAM+ 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14లో రన్ అవుతుంది. కంపెనీ రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు,మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తోంది. 5000mAh బ్యాటరీని ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనంగా Note 40 సిరీస్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే magCharge టెక్నాలజీతో 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా!

Advertisement

సైట్ ప్రకారం 10 నిమిషాల ఛార్జింగ్ 5.7 గంటల కాలింగ్, 4.4 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అలానే JBL స్పీకర్‌లు, NFC సపోర్ట్‌లో IP54 రేటింగ్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కోసం NFC సపోర్ట్ ఉంటుంది. Infinix ఇంకా దాని లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఫోన్ ధర గురించి కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర వివరాలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, వింటేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×