E-Paper
Advertisement

Mohan Babu: కల్కి.. అద్భుతం.. మహా అద్భుతం

Mohan Babu: కల్కి.. అద్భుతం.. మహా అద్భుతం
Advertisement

Mohan Babu: బాహుబలి తరువాత ప్రభాస్ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి2898AD ఎట్టకేలకు జూన్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో కల్కి గురించే చర్చ అంటే అతిశయోక్తి కాదు.

అసలు పురాణాలు చదవడానికి కూడా ఇష్టపడని యువత.. కల్కి సినిమా కోసం మహాభారతం చదివేస్తున్నారు. అర్జునుడు, కర్ణుడు ఎవరో కూడా తెలియని కుర్రాళ్ళు.. వారికోసం యుద్దాలు చేస్తున్నారు. వీరిని ఇలా మార్చింది ఎవరు అంటే నాగ్ అశ్విన్ అనే చెప్పాలి. మైథలాజికల్ తో సైన్స్ ఫిక్షన్ ను జోడించి కల్కి లాంటి అద్భుతాన్ని వెండితెరకు అందించాడు.

Advertisement

రెండు రోజుల్లో 289 కోట్లు రాబట్టి.. రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ కూడా కల్కి సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేస్తోంది. అభిమానులతో పాటు స్టార్ హీరోలు సైతం.. కల్కిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా కల్కిపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి, రజినీకాంత్, యష్, నాగార్జున .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది స్టార్స్.. కల్కి చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరాడు. కల్కి సినిమా చూసాక.. ఆయన తన రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Advertisement

” ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం… మహాద్భుతం…! మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ ను మోహన్ బాబు బావ అనడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.

అయితే మోహన్ బాబు, కృష్ణంరాజును అలాగే పిలిచేవాడని, ఇప్పుడు ఆయన లేకపోవడంతో ప్రభాస్ ను అలా పిలుస్తున్నాడని కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప లో ఒక పాత్రలో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కల్కి సునామీ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×