E-Paper
Advertisement

Infinix Note 50 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 5జి.. లాంచ్‌కు ముందే ట్రెండ్ క్రియేట్ చేస్తున్న న్యూ మోడల్

Infinix Note 50 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 5జి.. లాంచ్‌కు ముందే ట్రెండ్ క్రియేట్ చేస్తున్న న్యూ మోడల్

Infinix Note 50 Pro: దేశీయ మొబైల్ మార్కెట్లో పోటీ వేగంగా పెరుగుతోంది. వినియోగదారుల అంచనాలు పెరిగిన కొద్దీ బ్రాండ్‌లు కూడా మిడ్ రేంజ్ ధరల్లోనే ప్రీమియం ఫీచర్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నాయి. ఈ పోటీలో ఇన్ఫినిక్స్ తన ప్రత్యేకమైన డిజైన్‌, బలమైన స్పెక్స్‌తో మంచి గుర్తింపు సాధించుకుంది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రాబోతున్న నోట్ 50 ప్రో 5Gను పూర్తిగా ఫ్లాగ్‌షిప్ అనుభూతి వచ్చేలా రూపొందించినట్టు మొదటి లుక్స్ నుంచే స్పష్టంగా కనిపిస్తోంది.

డిజైన్ ఏఐ లైటింగ్

ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 5G డిజైన్ భాగం ఈ మోడల్‌లో నిజమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఆకట్టుకునేది యాక్టివ్ హాలో ఏఐ లైటింగ్. ఫోన్ వెనుక భాగంలో ఉండే ఈ లైట్ నోటిఫికేషన్లు, కాల్స్‌కు స్పందిస్తూ ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్ ఇస్తుంది. స్లిమ్ బాడీ, ఫోన్ ఎడ్జ్‌లు చేతిలో సూటిగా సరిపడే ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ముందుభాగంలో 93.6శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వల్ల డిస్‌ప్లే పూర్తిగా విస్తరించినట్టు కనిపిస్తుంది. దీనికి తోడు ఐపి53 రేటింగ్ ఉండటం వల్ల చినుకులు పడినా, డస్ట్ ఉన్న సమయంలోనూ ఈ ఫోన్ సేఫ్‌గా పనిచేస్తుంది.

అమోలేడ్ స్క్రీన్ డిస్‌ప్లే

డిస్‌ప్లే భాగానికి వస్తే, 6.78 అంగుళాల అమోలేడ్ స్క్రీన్ ఈ మోడల్‌కి అసలైన ఆకర్షణ. ఒక బిలియన్ రంగులు చూపగల ఈ స్క్రీన్‌లో 1080 × 2436 పిక్సెల్ రిజల్యూషన్ వల్ల ప్రతి ఫ్రేమ్ కచ్చితంగా కనిపిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి, 360Hz టచ్ సాంప్లింగ్ రేట్ వల్ల గేమింగ్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎక్కు ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 2160Hz పిడబ్ల్యుఎం డిమ్మింగ్ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గి స్క్రీన్ ఫ్లికరింగ్ తగ్గుతుంది. టియువి రీన్‌ల్యాండ్సర్టిఫికేషన్ దీర్ఘకాల వీయూయింగ్‌ను మరింత సేఫ్‌గా మార్చుతుంది.

పర్‌ఫార్మెన్స్.. 7200 చిప్‌సెట్‌..

ఈ ఫోన్‌లో పర్‌ఫార్మెన్స్ పరంగా చూస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ మోడల్‌లో 2.8GHz వరకు పనిచేసే ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఈ చిప్ పవర్‌ఫుల్ స్పీడ్ ఇచ్చినా బ్యాటరీని తక్కువగా వినియోగించేలా ఆప్టిమైజ్ చేయబడింది. మాలి జి610 గ్రాఫిక్స్ వల్ల గేమింగ్ సమయంలో ల్యాగ్ లేకుండా కచ్చితమైన ప్రతిస్పందన వస్తుంది. 8జిబి ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్‌తో పాటు అదనంగా 8జిబి వర్చువల్ ర్యామ్ జత కావడంతో మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. 256జిబి యుఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పెద్ద యాప్స్, వీడియోలు, ఫోటోలు అన్నీ సులభంగా నిల్వ చేయొచ్చు. 1టిబి వరకు మెమొరీ కార్డు సపోర్ట్ ఉండటం ఈ ఫోన్‌కి మరో ప్రత్యేక ఆకర్షణ.

Also Read: Lava Agni 4 Mobile: అగ్ని 4 లాంచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. డెమో@హోమ్‌తో లావా కొత్త ట్రెండ్

50ఎంపి వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా

ఫోన్ వెనుక భాగంలో 50ఎంపి వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా ఓఐఎస్‌తో కలిసి పనిచేయడం వల్ల చేయికదులుతున్న సమయంలోనూ స్టేబుల్ ఫోటోలు వస్తాయి. రాత్రి సమయంలో సూపర్ నైట్ మోడ్ చాలా స్పష్టమైన ఫోటోలు ఇస్తుంది. 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మాక్రో కెమెరా రావడంతో ఇతర కోణాల్లో కూడా ఫోటోలు తీయడం సులభం. ప్రో మోడ్, ఏఆర్ షాట్స్, డ్యూయల్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు క్రియేటివ్ కంటెంట్ తయారుచేసే వారికి ఉపయోగపడతాయి. ముందుభాగంలో ఉన్న 50ఎంపి కెమెరా డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కలిసి పనిచేయడం వల్ల తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ స్పష్టమైన సెల్ఫీలు తీయొచ్చు.

5000mAh సామర్థ్యం బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే, 5000mAh సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ ఒక రోజంతా హెవీ యూజ్ చేసినా సులభంగా నడుస్తుంది. 65W ఆల్ రౌండ్ ఫాస్ట్‌చార్జ్ 2.0 తో కొద్ది నిమిషాల్లోనే తగినంత చార్జ్ అందుతుంది. వైర్‌లెస్ చార్జింగ్ 33W సపోర్ట్ రావడం ఈ సెగ్మెంట్‌లో చాలా అరుదు. రివర్స్ చార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ రావడం వల్ల అదర్స్ డివైస్ కూడా చార్జ్ చేయొచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్.. కనెక్టివిటీ

ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే, ఈ మోడల్‌లో జెబిఎల్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్లు పెట్టడం ఇన్ఫినిక్స్ చేసిన పెద్ద హైలైట్. ఆడియో క్లారిటీ, లౌడ్‌నెస్ రెండూ ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటాయి. పెద్ద అమోలేడ్ స్క్రీన్, పవర్‌ఫుట్ స్పీకర్ల కలయికతో సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం ఎంతో ప్రీమియం అనిపిస్తుంది.
కనెక్టివిటీ భాగంలో వివిధ 5జి బ్యాండ్స్‌తో పాటు వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సి వంటి ముఖ్యమైన సపోర్ట్‌లు అందించడంతో స్థిరమైన కనెక్షన్ అనుభూతి లభిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు రోజువారీ ఉపయోగంలో సౌకర్యాన్ని పెంచుతాయి. ఇన్ఫినిక్స్ ఎక్స్1 చీతా చిప్ బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తూ సిస్టమ్ పనితీరు మెరుగుపరుస్తుంది.

భారత్‌లో ధర .. లాంచ్ వివరాలు?

ధర విషయానికి వస్తే, ఈ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌కు దగ్గరగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. లీక్ అవుతున్న రూమర్లను అనుసరించి భారతదేశంలో ఈ మోడల్ ఎంట్రీ వేరియంట్ ధర సుమారు రూ.23,000 నుండి రూ.24,000 మధ్యలో ఉండే అవకాశముంది. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో వినిపిస్తున్న సమాచారాన్ని చూస్తే, ఈ మోడల్ డిసెంబరు 12, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఎక్స్‌పెక్టెడ్ లాంచింగ్ టైమ్‌లైన్‌గా ఈ తేదీనే ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉంది. అధికారిక లాంచ్ వచ్చేసరికి మిడ్ రేంజ్ మార్కెట్లో పోటీని మరింత వేడెక్కించే మోడల్ అవుతుందని ఇప్పుడే స్పష్టమవుతోంది.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×