E-Paper
Advertisement

4,500 నిట్స్ బ్రైట్‌నెస్.. వెనుక వైపు LED డిస్‌ప్లే, Infinix Note 60 Pro ఫీచర్లు అరాచకం!

4,500 నిట్స్ బ్రైట్‌నెస్.. వెనుక వైపు LED డిస్‌ప్లే, Infinix Note 60 Pro ఫీచర్లు అరాచకం!
Advertisement

Infinix Note 60 Pro vs Note Edge: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ నుంచి ‘Note 60 Pro 5G’ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అయితే ఇదే సమయంలో బడ్జెట్ రేంజ్‌లో Note Edge కూడా అందుబాటులోకి రావడంతో అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ ఫోన్ కొంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది? అనే కన్ఫ్యూజన్ చాలామందిలో మొదలైంది. ఒకటేమో క్లాసీ లుక్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వస్తుంటే.. ఇంకోటి బడ్జెట్ ధరలో 5G స్పీడ్‌ని ఆఫర్ చేస్తోంది. మరి ఈ రెండింటికి ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనుక వైపు LED డిస్‌ప్లే..

Note 60 Pro 5G ఫోన్ వెనుక వైపు యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ అనే ఒక స్పెషల్ లైటింగ్ ఉంటుంది. ఫోన్‌కి నోటిఫికేషన్లు వచ్చినా లేదంటే ఫొటోలు తీస్తున్నా అది వెలుగుతూ స్టైలిష్‌గా కనిపిస్తుంది. పైగా దీనిలో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ వాడారు. దీని బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ ఉంటుంది. దీంతో మండుటెండలో బయట నిలబడి పోన్ వైపు చూసినా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అదే Note Edge విషయానికి వస్తే.. ఇది కాస్త సింపుల్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునే వారికి ఇది సెట్ అవుతుంది. అయితే Pro వెర్షన్ ఇచ్చే ఆ రిచ్ లుక్ మాత్రం ఇందులో ఆశించలేం.

Advertisement

Also Read: ఈ స్మార్ట్ టీవీల ధర ఆండ్రాయిడ్ పోన్ల కంటే తక్కువే.. బ్యాచిలర్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి!

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే..

ఫోన్ వాడేటప్పుడు అస్సలు హ్యాంగ్ అవ్వకూడదు అనుకుంటే.. నోట్ 60 ప్రో తీసుకోవచ్చు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ని వాడారు. భారీ గేమ్స్ ఆడినా లేదంటే ఒకేసారి నాలుగైదు యాప్స్ వాడుతున్నా ఇది చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో స్క్రీన్ లోపలే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇక నోట్ ఎడ్జ్‌లో డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్ ఉంది. కాకపోతే ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పక్కన (సైడ్ మౌంటెడ్) ఉంటుంది.

కెమెరా సంగతేంటి?

Advertisement

ఇక కెమెరాల విషయానికి వస్తే రెండింటిలోనూ 50MP మెయిన్ కెమెరా ఉంది. కానీ ప్రో మోడల్‌లో OIS అనే ఫీచర్ ఇచ్చారు. దీంతో నడుస్తూ వీడియో తీసినా, తక్కువ లైటింగ్‌లో ఫొటోలు తీసినా అవి షేక్ అవ్వకుండా చాలా క్వాలిటీగా వస్తాయి. అలాగే సెల్ఫీలు ఇష్టపడే వారికి కూడా ప్రో మోడల్ మంచి ఛాయిస్. ఎందుకంటే.. దీని ఫ్రంట్ కెమెరాతో 4K వీడియోలు కూడా తీసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు ప్రో వెర్షన్‌ను ట్రై చేయడం ఉత్తమం.

ధరలు వివరాలు ఇలా..

నోట్ 60 ప్రోలో 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. దీంతో అరగంటలోపే ఫోన్ ఫుల్ అయిపోతుంది. పైగా దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే నోట్ ఎడ్జ్‌లో మాత్రం 45W ఛార్జింగ్ వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. నోట్ 60 ప్రో 5G ధర రూ.31,999 నుండి మొదలవుతుండగా.. నోట్ ఎడ్జ్ మాత్రం రూ.19,000 రేంజ్‌లోనే దొరుకుతుంది. ఈ రెండింటికీ మధ్య రూ.12,000 గ్యాప్ ఉంది. ఒకవేళ మీకు లేటెస్ట్ టెక్నాలజీ.. క్లాసీ లుక్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే ప్రో వెర్షన్‌ను కొనుగోలు చేయొచ్చు. లేదంటే బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలి అనుకుంటే.. నోట్ ఎడ్జ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: ఈ ఫోన్ ఏంట్రా ఇంత ముద్దుగా ఉంది.. Infinix Note 60 Pro వెనుక డిస్‌ప్లే చూస్తే మతిపోతుంది!

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×