E-Paper
Advertisement

ఈ ఫోన్ ఏంట్రా ఇంత ముద్దుగా ఉంది.. Infinix Note 60 Pro వెనుక డిస్‌ప్లే చూస్తే మతిపోతుంది!

ఈ ఫోన్ ఏంట్రా ఇంత ముద్దుగా ఉంది.. Infinix Note 60 Pro వెనుక డిస్‌ప్లే చూస్తే మతిపోతుంది!
Advertisement

Infinix Note 60 Pro Launched: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను అందించే కంపెనీగా ఇన్ఫినిక్స్‌కు మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ భారతదేశంలో ‘ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో’ పేరుతో ఒక పవర్‌ఫుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. మునుపెన్నడూ చూడని విధంగా ఫోన్ వెనుక భాగంలో ఒక ‘యాక్టివ్ మ్యాట్రిక్స్’ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది మన ఫోన్‌కు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా కాల్ వచ్చినప్పుడు వెనుక ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతూ ఫోన్‌కు ఒక వెరైటీ లుక్‌ను ఇస్తాయట.

లాంచ్ ఆఫర్ వివరాలు..

మధ్యతరగతి యూజర్ల గురించి ఆలోచించే ఇన్ఫినిక్స్.. ఈ ఫోన్ ధరను కూడా రీజనబుల్‌గానే పెట్టింది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.31,999 కాగా.. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 256GB వేరియంట్‌ను రూ.34,999కు తెచ్చారు. అయితే, SBI, ICICI వంటి బ్యాంక్ కార్డులు వాడితే వెంటనే రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు.. వడ్డీ లేని ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఏప్రిల్ 20 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: కలా? నిజమా? iPhone 15 రూ.35,000కే వచ్చేస్తోంది.. ఇవిగో పూర్తి వివరాలు!

కళ్లు చెదిరే స్క్రీన్..

ఈ ఫోన్ స్క్రీన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనిలో 6.78 అంగుళాల పెద్ద అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది కాబట్టి.. మనం ఫోన్ వాడుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఒకవేళ ఫోన్ కింద పడిపోయినా స్క్రీన్ త్వరగా పగలకుండా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇక కలర్స్ విషయానికి వస్తే.. బ్లూ, బ్రౌన్, ఆరెంజ్ వంటి సూపర్ కలర్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. వర్షంలో తడిచినా, దుమ్ము పడినా పాడవకుండా ఐపీ64 రేటింగ్‌తో గట్టిగానే ప్లాన్ చేశారు.

బ్యాటరీ మామూలుగా లేదుగా..

Advertisement

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో లో ఏకంగా 6,500mAh బ్యాటరీ ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కవ గంటల పాటు వాడుకోవచ్చు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల చాలా స్పీడ్‌గా ఛార్జ్ అయిపోతుంది. దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం విశేషం. ఇక ఫొటోల విషయానికి వస్తే.. వెనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి ఓఐఎస్ ఫీచర్ ఉండటం వల్ల మనం నడుస్తూ ఫొటోలు తీసినా అవి షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రొసెసర్‌తో ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్పొచ్చు.

Also Read: 165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!

 

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×