E-Paper
Advertisement

Infinix Note Edge: స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ.. భారత్‌లోకి వస్తోన్న ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలివే!

Infinix Note Edge: స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ.. భారత్‌లోకి వస్తోన్న ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ప్రత్యేకతలివే!
Advertisement

Infinix Note Edge: ఇన్ఫినిక్స్ తన Note సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి త్వరలో విడుదల చేయబోతోంది. తాజాగా బయటకు వచ్చిన టీజర్ పోస్టర్ ప్రకారం.. ఈ ఫోన్ Infinix Note Edge పేరుతో రానుంది. పోస్టర్‌లో పూర్తి స్పెసిఫికేషన్స్ వెల్లడించబడనప్పటికీ.. కొన్ని కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.

డిజైన్ విషయానికి వస్తే.. Note Edge అల్ట్రా స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో, టాప్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు, LED ఫ్లాష్ మరియు అదనపు ఫిల్లర్ లైట్ ఉండే అవకాశముంది. టెక్ వర్గాలు దీన్ని మోటోరోలా ఎడ్జ్ 70 తరహా డిజైన్‌లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

ఇక డిస్‌ప్లే పరంగా చూసుకుంటే నోట్ ఎడ్జ్‌లో 3D కర్డ్వ్ AMOLED ప్యానెల్ ఉండనుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇది 1.5K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం, ఈ ఫోన్ MediaTek Dimensity 7100 SoC ఉపయోగించబడవచ్చని సమాచారం ఉంది. ఇది 6nm ప్రాసెస్ టెక్నాలజీపై తయారవుతుంది.

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ హ్యాండ్ సెట్.. 6,500mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీతో రానుంది. సాఫ్ట్‌వేర్‌లో Android 16 వర్షన్ బాక్స్ నుంచే అందించబడనుంది. అదనంగా, ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా అందించనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

భారత్‌లో 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశముందని, దీని ప్రారంభ ధర రూ.20,000 లోపే ఉండవచ్చని తెలుస్తోంది. టీజర్ పోస్టర్‌లో ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్లో కనిపించింది.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×