E-Paper
Advertisement

Durgam Cheruvu: దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌..

Durgam Cheruvu: దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌..
Advertisement

Durgam Cheruvu: చుట్టూ ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్‌గా పేరుగాంచిన దుర్గంచెరువును క‌బ్జాల చెర నుంచి విడిపిస్తోంది హైడ్రా. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను తొల‌గించింది. మ‌ట్టితో చదును చేసి.. వాహ‌నాల పార్కింగ్ కోసం వినియోగించి.. ప్రతి నెలా 50 లక్షల వ‌ర‌కూ అద్దెలు వ‌సూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహ‌నాల‌ను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. త‌ర్వాత మ‌ట్టిని తొల‌గించేందుకు హైడ్రా చ‌ర్యలు తీసుకుంటోంది. దుర్గంచెరువు క‌బ్జాల‌పై ప్రజావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుకు స్పందించిన హైడ్రా.. రంగంలోకి దిగింగి. 5 ఎక‌రాల మేర ఉన్న ఆక్రమ‌ణ‌ల‌ను హైడ్రా తొలగించింది.

గోల్కొండ కోట‌లోని రాజ‌వంశానికి తాగు నీరందించిన దుర్గం చెరువుకు ఆక్రమ‌ణ‌ల దుర్గంధం అంటుకుంది. చుట్టూ కొండ‌ల మ‌ధ్య ఎంతో శుద్ధమైన జ‌లాల‌తో దాహార్తిని తీర్చిన ఈ చెరువు క‌బ్జాల‌తో కుచించుకుపోయింది. న‌గ‌రం న‌డిబొడ్డున‌.. ఐటీ కారిడార్‌లో అంద‌మైన స‌ర‌స్సుగా అల‌రించిన దుర్గం చెరువు మురుగునీటితో దుర్గంధంగా మారింది. ఒక‌ప్పుడు 160 ఎక‌రాల మేర ఉన్న చెరువు నేడు 116 ఎక‌రాలుగా మిగిలిపోయింది. చెరువుకు ఉత్తర దిశ త‌ప్పితే.. మూడువైపులా ఆక్రమ‌ణ‌ల‌కు గురైంది. 1976 నాటికే 29 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జా అయి.. 131.66 ఎక‌రాల‌కు మిగిలిపోయింది. 1976 నుంచి 1995 వ‌ర‌కూ భ‌ద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవ‌త్సరం వ‌ర‌కూ మ‌రో 10 ఎక‌రాల మేర క‌బ్జాకు గురై.. 121 ఎక‌రాల‌కు కుంచించుకుపోయింది. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి నేటికి మ‌రో 5 ఎక‌రాలు క‌బ్జాకు గురైంది. ఇలా ఎప్పుడు ఏ సంవ‌త్సరంలో క‌బ్జాల ప‌ర్వం ఎలా సాగిందో NRSC అందించిన శాటిలైట్ చిత్రాలు క‌ళ్లకు క‌డుతున్నాయి.

Advertisement

మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎక‌రాలు క‌బ్జాల‌కు గురైంది దుర్గం చెరువు. కొండ‌ల‌ను త‌వ్వుతూ భ‌వంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీట‌ర్ల మేర మ‌ట్టితో నింపి క్రమంగా చెరువులోకి జ‌రిగి ఏకంగా 5 ఎక‌రాల‌ను క‌బ్జా చేశారు. అలా చెరువు FTL ప‌రిధిలో ఆక్రమించిన స్థలం నాదంటూ ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు క్లైం చేస్తున్నాడు. అంతే కాదు.. స్కూల్ బ‌స్సులు, ఐటీ సంస్థల‌కు చెందిన వాహ‌నాల పార్కింగ్‌తో ప్రతి నెల రూ. 50 ల‌క్షల వ‌ర‌కూ అద్దెలు అనుభ‌విస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్కడ పార్కింగ్ దందా చేస్తున్నాడు. నెమ్మదిగా మ‌ట్టిని నింపుకుంటూ ఎక‌రం నుంచి 5 ఎక‌రాల వ‌ర‌కూ ఆ ప్రజా ప్రతినిధి ఆక్రమించేశాడు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమ‌ణ అడ్డుగా మారింది. HMDA మాత్రం 2014లో 160.7 ఎక‌రాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. NRSP, స‌ర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశాల్యాన్ని తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్నమైంది. ఈలోపు చెరువు ప‌రిధిలో ఉన్న ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గిస్తోంది.

ALSO READ: Viral Video: నా లవర్‌ను అలా పిలుస్తావా.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు..?

Advertisement

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×