E-Paper
Advertisement

గ్యాస్ స్టవ్ vs ఇన్‌ఫ్రారెడ్.. డీప్ ఫ్రై వంటకాలకు.. ఏది బెస్ట్ అంటే?

గ్యాస్ స్టవ్ vs ఇన్‌ఫ్రారెడ్.. డీప్ ఫ్రై వంటకాలకు.. ఏది బెస్ట్ అంటే?
Advertisement

Infrared Cooking: సాధారణంగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామూలు వంటకాలతో పోలిస్తే.. వేపుళ్లు అధికంగా గ్యాస్ ను వినియోగిస్తాయి. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ (Infrared Cooktop)ను ఉపయోగించి.. డీప్ ఫ్రైయింగ్ చేసుకుంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ తో పోలిస్తే ఇన్‌ఫ్రారెడ్ బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

అన్నివైపులకు సమాన వేడి

సాధారణంగా గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే మంట ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఇన్‌ఫ్రారెడ్ లో అలా కాదు. దీనిలోని టెక్నాలజీ.. హీట్ ను పాత్ర మెుత్తానికి సమానంగా ప్రసారం చేస్తుంది. దీనివల్ల నూనే స్థిరంగా వేడెక్కి.. ఆహారపదార్థాలు మాడిపోకుండా ఉంటాయి.

అన్ని పాత్రలకూ అనుకూలం

Advertisement

ఇండక్షన్ స్టవ్ లేదా గ్యాస్ స్టవ్ తరహాలో దీనికి ప్రత్యేకమైన పాత్రలు అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పాత అల్యూమినియం కడాయిలు, స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు లేదా మట్టి పాత్రలను కూడా దీనిపై వాడుకోవచ్చు.

ఉష్ణోగ్రతపై కంట్రోల్..

ఇన్‌ఫ్రారెడ్ లో ఉండే డిజిటల్ కంట్రోల్స్ ద్వారా ఉష్ణోగ్రతను (Temperature) మనకు కావలసిన రీతిలో సెట్ చేసుకోవచ్చు. ఇది నూనె మరీ ఎక్కువగా కాగకుండా చూడటంలో సహాయపడుతుంది. తద్వారా ఆహారం తన సహజరుచులను కోల్పోకుండా ఉంటాయి.

డీప్ ఫ్రైయింగ్ చిట్కాలు

Advertisement

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ చాలా వేగంగా వేడెక్కుతుంది కాబట్టి తొలుత మీడియం సెట్టింగ్‌లోనే నూనెను వేడి చేయాలి. ఆ తర్వాతే డీప్ ఫ్రైయింగ్ మొదలుపెడితే మంచిది. మరోవైపు నూనెలో వేయించే పదార్థాల్లో తడి లేకుండా జాగ్రత్త తప్పనిసరి. ఒకవేళ పదార్థాల లోపల తేమ ఉంటే అది బయటకు చింది.. గాయపడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె చుక్కలు పడినా.. స్టవ్ చల్లారిన తర్వాత ఒక మెత్తని గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ లాగా బర్నర్లు క్లీన్ చేసే పని.. ఇన్ ఫ్రారెడ్ కుక్ టాప్స్ కు ఉండదు.

Also Read: కరెంటు లేకుండా.. పనిచేసే ఫ్రిడ్జ్.. ఇది తెలియక ఇన్నాళ్లు..!

గ్యాస్ vs ఇన్‌ఫ్రారెడ్.. ఏది బెస్ట్?

దేశంలో గ్యాస్ కొరత, పెరుగుతున్న సిలిండర్ ధరలతో పోలిస్తే.. ఇన్‌ఫ్రారెడ్ వాడకం బెటరని చెప్పవచ్చు. సిలిండర్ ఖర్చుతో పోలిస్తే.. విద్యుత్ బిల్లు తక్కువగా ఉంటుంది. భద్రతాపరంగా చూసినా.. ఇన్ ఫ్రారెడ్ బెటర్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఒకవేళ గ్యాస్ లీకైతే దాని తర్వాత జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయి. ఇన్ ఫ్రారెడ్ కరెంటుతో పనిచేస్తున్నందున అగ్నిప్రమాదాల భయం తక్కువగా ఉంటుంది. పైగా వంటగది హీట్ ఎక్కకుండా ఉంటుంది.

Also Read: Fuel Hike: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్.. లీటర్‌పై ఎంతంటే?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×