E-Paper
Advertisement

ఏసీ కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్.. మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

ఏసీ కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్.. మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

Inverter AC vs Non-Inverter AC: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో ఏసీల వాడకం తారాస్థాయికి చేరిపోతుంది. అయితే కొత్తగా ఏసీ కొనాలనుకునే వారికి ‘ఇన్వర్టర్ ఏసీ’ (Inverter AC) బాగుంటుందా? లేక ‘నాన్-ఇన్వర్టర్ ఏసీ’ (Non-Inverter AC) బెటరా? అనే సందేహం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండింటిలో ఏది బెస్ట్? విద్యుత్ బిల్లు ఆదా, కూలింగ్ సామర్థ్యం, ధర పరంగా దేనిది పైచేయి? వంటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కంప్రెషర్ పనితీరు

సాధారణంగా ఏ ఏసీకి అయినా కంప్రెషర్ చాలా కీలకం. నాన్ ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెషర్ ఒకే వేగంతో పనిచేస్తుంది. గది చల్లబడగానే అది పూర్తిగా ఆగిపోయి.. మళ్లీ వేడెక్కగానే పూర్తి శక్తితో మళ్లీ స్టార్ట్ అవుతుంది. అదే ఇన్వర్టర్ ఏసీ అయితే.. గది చల్లదనాన్ని బట్టి కంప్రెషర్ వేగాన్ని దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటూ నిరంతరాయంగా పనిచేస్తుంది.

విద్యుత్ బిల్లుల భారం

Advertisement

ఇన్వర్టర్ ఏసీలు సాధారణ ఏసీలతో పోలిస్తే.. 30 శాతం నుండి 40 శాతం వరకు కరెంట్ ను ఆదా చేస్తాయి. నాన్-ఇన్వర్టర్ ఏసీలు కంప్రెషర్ ఆన్/ఆఫ్ అయ్యే ప్రతిసారీ ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఫలితంగా నెలకు వచ్చే కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూలింగ్, సుఖమైన నిద్ర

నాన్-ఇన్వర్టర్ ఏసీలలో కంప్రెషర్ తరచూ ఆగి, మళ్లీ స్టార్ట్ అవ్వడం వల్ల గది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పైగా స్టార్ట్ అయ్యేటప్పుడు శబ్దం ఎక్కువగా వస్తుంది. కానీ ఇన్వర్టర్ ఏసీలు ఇందుకు భిన్నంగా గదిలో ఒకే టెంపరేచర్ ను మెయిన్ టెన్ చేస్తాయి. పైగా తక్కువ శబ్దంతో పనిచేడం వల్ల రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ధర పరంగా చూస్తే..

Advertisement

ధర విషయానికి వస్తే.. నాన్ ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే విద్యుత్ బిల్లు ఆదా పరంగా చూస్తే 1-2 ఏళ్లలో అదనంగా పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా నాన్ ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే.. ఇవి చాలా మన్నికగా ఉంటాయని రీసేల్ వాల్యూ కూడా చాలా బెటర్ గా ఉంటుందని తెలియజేస్తున్నారు.

Also Read: రామ్ చరణ్ ‘పెద్ది’పై నెగిటివిటీ తీసుకొస్తే ఇక అంతే!.. మూవీ టీం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు..

ఫైనల్గా రెండింట్లో ఏది కొనాలి?

రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం.. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఏసీ వాడాలనుకుంటే ఇన్వర్టర్ ఏసీ కళ్లుమూసుకొని తీసుకోవచ్చు. అలా కాకుండా ఆఫీసు రూమ్‌ల కోసం రోజుకు 1-2 గంటలు మాత్రమే వాడేలా ఉండి బడ్జెట్ తక్కువగా ఉంటేనే నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం బెటర్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఇన్వర్టర్ ఏసీయే స్మార్ట్ ఛాయిస్ అని కూడా సూచిస్తున్నారు.

Also Read: మీరు దూరమైన తరువాతే ఇతరులకు మీ విలువ తెలుస్తుంది.. ఈ చేదు నిజం వెనుక కారణం ఇదే

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×