E-Paper
Advertisement

Split vs window vs portable AC: ఇంటికి ఏ ఏసీ బెస్ట్? కరెంట్ బిల్లు తక్కువ వచ్చేది ఏది?

Split vs window vs portable AC: ఇంటికి ఏ ఏసీ బెస్ట్? కరెంట్ బిల్లు తక్కువ వచ్చేది ఏది?
Advertisement

Split AC vs Window AC vs Portable AC: ఎండలు మండిపోతున్న వేళ ఇళ్లలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే మార్కెట్లో లభించే స్ప్లిట్ (Split), విండో (Window), పోర్టబుల్ (Portable) ఏసీలలో ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది? ఏది కొంటే మంచిది? అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆ కన్ఫ్యూజన్ ను ఈ కథనంలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

విద్యుత్ ఖర్చు దేనిలో ఎక్కువంటే?

సాధారణంగా ఈ మూడింటిలో పోర్టబుల్ ఏసీ (Portable AC) అన్నింటికంటే ఎక్కువ కరెంట్ ఖర్చు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో విండో ఏసీ నిలవగా స్ప్లిట్ ఏసీ (Split AC) అన్నింటికంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని తెలియజేస్తున్నారు.

అసలు కారణాలు ఇవే

Advertisement

పోర్టబుల్ ఏసీ కంప్రెషర్, బ్లోయర్ అన్నీ ఒకే యూనిట్‌లో ఉండి గది లోపలే ఉంటాయి. ఇది గదిలోని వేడిని బయటకు పంపడానికి పైపును వినియోగిస్తుంది. ఈ ప్రక్రియలో గదిలోని చల్లటి గాలి కూడా కొంత బయటకు పోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీని కంప్రెషర్ గదిలోనే ఉండటం వల్ల కొంత వేడి లోపలే విడుదలవుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా గది చల్లబడటానికి కంప్రెషర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుందని, అందుకే ఇది ఎక్కువ కరెంట్ లాగుతుందని వివరిస్తున్నారు.

విండో ఏసీ పరిస్థితేంటి?

విండో ఏసీ విషయానికి వస్తే.. ఇది సింగిల్ యూనిట్ అయినప్పటికీ సగం భాగం గది బయటే ఉంటుంది. దీని సామర్థ్యం బాగున్నప్పటికీ ఆధునిక స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే దీని సాంకేతికత కొంత పాతది. దీనివల్ల విద్యుత్ వినియోగం కొంచెం ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా నెల పూర్తయ్యేసరికి విద్యుత్ బిల్లు భారంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: ఏసీ కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్.. మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

మరి స్ప్లిట్ ఏసీల సంగతేంటి?

ఈ ఏసీల్లో ఇండోర్, అవుట్‌డోర్ అని రెండు యూనిట్లు ఉంటాయి. వేడిని పుట్టించే కంప్రెషర్ బయటి వైపు ఉంటుంది. పైగా ప్రస్తుతం వచ్చే స్ప్లిట్ ఏసీలలో ‘ఇన్వర్టర్ టెక్నాలజీ’ ఎక్కువగా ఉండటం వల్ల గది చల్లబడగానే ఇది కంప్రెషర్ వేగాన్ని తగ్గించి ఉష్ణోగ్రతను స్థిరంగా మెయిన్ టెన్ చేస్తుంది. అందువల్ల ఇది చాలా తక్కువ కరెంట్ వినియోగిస్తూ.. పోర్టబుల్, విండో ఏసీలతో పోలిస్తే బెటర్ ఆప్షన్ గా నిలుస్తోంది. అయితే ఆ రెండింటితో పోలిస్తే దీని ఖరీదు కాస్త ఎక్కువగా ఉండటం గమనార్హం.

Also Read: Wamiqa Gabbi: స్టైలిష్ లుక్ వామికా అదుర్స్.. ఇదేం స్టిల్స్ తల్లి..

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×