E-Paper
Advertisement

ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తెలియకపోతే ప్రమాదంలో పడ్డట్లే!

ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తెలియకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement

Inverter safety tips home: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఇన్వర్టర్ అనేది ఒక కామన్ గ్యాడ్జెట్ అయిపోయింది. కరెంట్ పోయినప్పుడు ఫ్యాన్లు, లైట్లు తిరగడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. అయితే.. ఇన్వర్టర్‌ను మనం ఎంతగా వాడుతున్నామో.. దాని సేఫ్టీ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్లు, బ్యాటరీ లీకేజీలు, కొన్నిసార్లు బ్లాస్టింగ్స్ జరిగే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం హోమ్ ఓనర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5  ఇన్వర్టర్ సేఫ్టీ టిప్స్ మీకోసం..

ఇన్వర్టర్  సేఫ్టీ టిప్స్: 

1. గాలి ఆడే చోటే పెట్టండి:

చాలా మంది ఇల్లు అందంగా కనిపించాలని ఇన్వర్టర్ , దాని బ్యాటరీని ఒక చిన్న కబోర్డ్ లోపల పెట్టి డోర్లు క్లోజ్ చేసేస్తుంటారు. ఇది చాలా డేంజర్. బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు, పవర్ సప్లై ఇస్తున్నప్పుడు విపరీతంగా వేడెక్కుతుంది. అంతేకాదు.. అందులోని కెమికల్ ప్రాసెస్ వల్ల కొద్దిగా హైడ్రోజన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ బయటకి వెళ్లడానికి, సిస్టమ్ కూల్ అవ్వడానికి ప్రాపర్ వెంటిలేషన్ చాలా అవసరం. అందుకే ఇన్వర్టర్‌ను ఎప్పుడూ కాస్త ఓపెన్ గా ఉండే ఏరియాలో.. డైరెక్ట్ ఎండ పడని చోట మాత్రమే ఉంచాలి.

2. బ్యాటరీ వాటర్ టాప్-అప్:

Advertisement

ట్యూబులర్ బ్యాటరీలలో వాటర్ లెవెల్ చెక్ చేయడం చాలా ముఖ్యం. నీటి శాతం తగ్గిపోతే బ్యాటరీ ప్లేట్లు డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఇంట్లో ఉండే ఫిల్టర్ వాటర్ లేదా కుళాయి నీటిని అందులో పోస్తుంటారు.

రూల్: బ్యాటరీలో కేవలం డిస్టిల్డ్ వాటర్ మాత్రమే పోయాలి. నార్మల్ వాటర్‌లో ఉండే మినరల్స్ బ్యాటరీ లైఫ్‌ని పూర్తిగా దెబ్బతీస్తాయి.

Advertisement

జాగ్రత్త: వాటర్ లెవెల్ మార్కులను చూస్తూ కరెక్ట్ లెవెల్ వరకే నింపాలి. ఓవర్ ఫ్లో అస్సలు చేయకూడదు. వాటర్ మార్చేటప్పుడు ఇన్వర్టర్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.

3. టెర్మినల్స్ క్లీనింగ్:

బ్యాటరీకి వైర్లు కనెక్ట్ చేసే పాజిటివ్, నెగెటివ్ టెర్మినల్స్ పై కొన్ని రోజులకి తెల్లటి కార్బన్ లేదా రస్ట్ (తుప్పు) పేరుకుపోతుంది. దీని వల్ల కరెంట్ ఫ్లో సరిగ్గా ఉండక బ్యాటరీ వేడెక్కడం, స్పార్క్స్ రావడం జరుగుతుంది.

క్లీనింగ్ టిప్: నెలకోసారి ఇన్వర్టర్ ఆఫ్ చేసి, ఆ టెర్మినల్స్‌ను బేకింగ్ సోడా నీళ్లతో లేదా వేడి నీళ్లతో పాత బ్రష్ సాయంతో క్లీన్ చేయాలి. ఆ తర్వాత తడి లేకుండా తుడిచి, కాస్త పెట్రోలియం జెల్లీ లేదా గ్రీజ్ రాస్తే రస్ట్ పట్టకుండా ఉంటుంది.

4. ఓవర్‌లోడింగ్ వద్దు:

ప్రతి ఇన్వర్టర్‌కి కొంత పవర్ కెపాసిటీ ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు కేవలం లైట్లు, ఫ్యాన్లు, వైఫై రూటర్, టీవీ లాంటి బేసిక్ డివైజ్‌లు మాత్రమే వాడాలి. అలా కాకుండా ఫ్రిజ్, గీజర్, వాషింగ్ మెషీన్, మిక్సీ లాంటి హెవీ లోడ్ ఉన్న వాటిని కనెక్ట్ చేస్తే ఇన్వర్టర్ పై భారం పడి ఫ్యూజ్ ఎగిరిపోవడమే కాకుండా.. ఇంటర్నల్ వైరింగ్ కాలిపోయే ప్రమాదం ఉంది. మీ ఇన్వర్టర్ కెపాసిటీకి మించి లోడ్ అస్సలు ఇవ్వకండి.

5. క్వాలిటీ వైరింగ్ & పిల్లలకు దూరంగా:

ఇన్వర్టర్ కనెక్షన్ల కోసం లోకల్ వైర్లను వాడొద్దు. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న బ్రాండెడ్ ఇన్సులేటెడ్ వైర్లను మాత్రమే వాడాలి. లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఇన్వర్టర్ బ్యాటరీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉంటుంది కాబట్టి, ఆ సెటప్‌ను ఇంట్లోని చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా.. కాస్త ఎత్తైన ప్లేస్‌లో లేదా ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ ఇన్వర్టర్ బాక్స్‌లో ఉంచడం చాలా సేఫ్.

Also Read: ఆపిల్, శామ్‌సంగ్‌లకి గట్టి పోటీ.. vivo X300 FE 5G ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల జాతర!

పాతకాలపు మాన్యువల్ ఇన్వర్టర్ల కంటే ఇప్పుడు స్మార్ట్ ఏఐ డిస్‌ప్లే ఉన్న ఇన్వర్టర్ల కోసం జనాలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఇవి బ్యాటరీ ఓవర్‌హీట్ అయినా, లేదా వాటర్ లెవెల్ తగ్గినా ఆటోమేటిక్‌గా అలారమ్ సౌండ్‌తో మనల్ని అలర్ట్ చేస్తాయి. మీ ఇన్వర్టర్ 4-5 ఏళ్లు దాటితే, వెంటనే ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో వైరింగ్ , బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయించడం మంచిది.

ఇన్వర్టర్ అనేది మన లైఫ్‌ని ఈజీ చేసే గ్యాడ్జెట్, కానీ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే పైన చెప్పిన సేఫ్టీ టిప్స్ పాటిస్తూ, ప్రతి 2-3 నెలలకోసారి ఒకసారి సెటప్ మొత్తాన్ని చెక్ చేసుకుంటే మీ ఇన్వర్టర్ లైఫ్ పెరుగుతుంది. మీ ఇల్లు కూడా సేఫ్‌గా ఉంటుంది. ఈ రోజే మీ ఇంట్లోని ఇన్వర్టర్ కండిషన్‌ని ఒకసారి చెక్ చేసుకోండి

Related News

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్

రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!

రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా? దీని కంటే బెస్ట్ ఉండదు

రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

రూ.10వేలలోపు హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్..బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

Big Stories

Advertisement
×