E-Paper
Advertisement

ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!
Advertisement

Jathi Ratnalu : టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే నవ్వుల రికార్డులను సృష్టిస్తాయి. అలా 2021 మార్చి 11న విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోయింది. జోగిపేట శ్రీకాంత్, శేఖర్, రవిల అమాయకత్వం, సిల్లీ వన్-లైనర్స్ థియేటర్లలో నవ్వుల తుఫాన్ సృష్టించాయి. నవీన్ పొలిశెట్టి టైమింగ్, ప్రియదర్శి నటన, రాహుల్ రామకృష్ణ బాడీ లాంగ్వేజ్ వెండితెరపై ఒక మ్యాజిక్ చేశాయి. వీరికి తోడుగా ‘చిట్టి’ పాత్రలో ఫరియా అబ్దుల్లా కుర్రకారు మనసులను దోచుకుంది. ఎలాంటి భారీ యాక్షన్ సీక్వెన్సులు, మైండ్ బెండింగ్ ట్విస్టులు లేకపోయినా, కేవలం స్వచ్ఛమైన కామెడీతోనే ఈ సినిమా వంద కోట్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది.

జాతిరత్నాలు సీక్వెల్ కావాలంటున్న మూవీ లవర్స్

అప్పటి నుండి ఈ క్రేజీ స్టోరీకి మళ్ళీ ఎప్పుడు సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.అయితే దర్శకుడు అనుదీప్ కె.వి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించడానికి రెడీగా ఉన్నారన్న టాక్ నెట్టింట జోరుగా
టాక్ నడిచింది. అయితే, ఈ సినిమాని ప్రెసెంట్ చేసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లారిటీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

కథ లేదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్న నాగీ 

Advertisement

జాతి రత్నాలు సీక్వెల్ గురించి ఆయన మాట్లాడుతూ, కమర్షియల్‌గా ఈ సినిమాను నిర్మించడం చాలా సులువైన విషయమేనని, కానీ ఆ బ్రాండ్ వాల్యూని కాపాడాలంటే బలమైన కథ ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్ట్-2 చేయడానికి సరిపోయే పక్కా కథ తమ వద్ద లేదని ఆయన నిజాయితీగా ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారనే చెప్పాలి.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ దృష్టి మొత్తం 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ‘కల్కి పార్ట్ 2’ పనులపైనే ఉంది. మరోవైపు హీరో నవీన్ పొలిశెట్టి కూడా అనగనగా ఒక రాజు విజయం తర్వాత మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు డిజిటల్ సిరీస్‌లు, సరికొత్త రోల్స్ తో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు.

ఈ సాలిడ్ సీక్వెల్ వెపన్ ని ఎప్పుడు బయటికి తీస్తాడో

అయితే ..జాతి రత్నాలు సీక్వెల్ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు కాలేదనేది ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం. దర్శకుడు అనుదీప్ ఒక అద్భుతమైన, లాజికల్ వెరైటీ సబ్జెక్ట్‌ను లైన్‌లోకి తెస్తే ఈ ముగ్గురు జోగిపేట రత్నాలు మళ్లీ సెట్స్ పైకి రావడం ఖాయం. కల్కి లాంటి భారీ మైథాలజీ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ కూడా మళ్లీ ఇలాంటి ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించడానికి ఆసక్తిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే, ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటే మాత్రం, థియేటర్ల బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూత పూయడం. చూడాలి మరి ప్లాపులతో సావాసం చేస్తున్న అనుదీప్ ఈ సాలిడ్ సీక్వెల్ వెపన్ ని ఎప్పుడు బయటికి తీస్తాడో !
also read :జాన్వీ ఇన్‌స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!

Related News

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?

ఇకపై ప్రతి పెళ్లిలో ఈ పాటే మోగాల్సిందే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వెడ్డింగ్ వైబ్స్!

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

Big Stories

Advertisement
×