E-Paper
Advertisement

మొండి మరకలైనా మాయం! ఫ్రిజ్‌ను కొత్తదానిలా మెరిపించే 5 సింపుల్ టిప్స్!

మొండి మరకలైనా మాయం! ఫ్రిజ్‌ను కొత్తదానిలా మెరిపించే 5 సింపుల్ టిప్స్!
Advertisement

Fridge Cleaning Tips: ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అనేది ఇప్పుడు ఒక నిత్యావసర వస్తువు. పాలు, కూరగాయలు, మిగిలిన వంటలు.. ఇలా అన్నీ అందులోనే దాస్తాం. కానీ సరిగ్గా క్లీన్ చేయకపోతే.. అదే ఫ్రిజ్ కొన్ని సార్లు బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. లోపల వచ్చే వాసన మనల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ఖరీదైన కెమికల్స్ వాడకుండా.. ఇంట్లో ఉండే సాదాసీదా వస్తువులతోనే మీ ఫ్రిజ్‌ను మెరిసేలా ఎలా మార్చుకోవాలో తెలుసా? మీ పనిని ఈజీ చేసే ఆ 5 అద్భుతమైన ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం అనేది చాలా మందికి ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. లోపల ఉన్న సెల్ఫ్స్ తీయడం, మరకలు పోగొట్టడం.. ఇదంతా టైమ్ తీసుకునే పని. కానీ స్మార్ట్‌గా ఆలోచిస్తే.. ఈ పనిని చాలా త్వరగా పూర్తి చేయొచ్చు.

Advertisement

ఫ్రిజ్‌ను కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్:

1. బేకింగ్ సోడా మ్యాజిక్:
ఫ్రిజ్‌లో పడ్డ పాలు లేదా కూరగాయల వల్ల ఏర్పడే మొండి మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా కంటే మించిన ఆయుధం లేదు. రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కొంచెం గోరు వెచ్చని నీటిలో కలిపి పేస్ట్‌లా చేయండి. ఆ పేస్ట్‌ను మరకలు ఉన్న చోట రాసి 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత మెత్తని బట్టతో తుడిస్తే.. మరకలు ఇట్టే మాయమవుతాయి. ఇది ప్లాస్టిక్‌ను పాడు చేయదు సరికదా, తెల్లగా మెరిపిస్తుంది.

Advertisement

2. వెనిగర్ & నిమ్మరసం స్ప్రే:
లోపల పేరుకుపోయిన జిడ్డును వదిలించడానికి వైట్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో సమానంగా నీరు, వెనిగర్ కలిపి అందులో కొంచెం నిమ్మరసం పిండండి. దీనిని ఫ్రిజ్ గోడల మీద, అరల మీద స్ప్రే చేసి తుడవండి. నిమ్మరసం మంచి సువాసనను ఇస్తే.. వెనిగర్ క్రిములను చంపుతుంది.

3. వాసన పోవాలంటే ‘కాఫీ’:
చాలా కాలం వాడుతున్న ఫ్రిజ్ నుంచి ఒక రకమైన వింత వాసన రావడం సహజం. దీనిని పోగొట్టడానికి ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి ఒక మూలన ఉంచండి. కాఫీకి చెడు వాసనలను పీల్చుకునే శక్తి ఉంది. ఒక వేళ కాఫీ అందుబాటులో లేకపోతే.. చిన్న యాక్టివేటెడ్ చార్‌కోల్ ముక్కను ఉంచినా రిజల్ట్ కనిపిస్తుంది.

Also Read: ఫ్రిజ్ డోర్ సెల్ఫ్స్‌లో ఏం స్టోర్ చేయాలో తెలుసా ? 99 % మందికి చేసే పొరపాట్లు ఇవే

4. షెల్ఫ్ లైనింగ్ ట్రిక్:
క్లీనింగ్ పనిని భవిష్యత్తులో సింపుల్‌గా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఐడియా. ఫ్రిజ్ షెల్ఫ్స్ మీద ప్లాస్టిక్ మ్యాట్స్ లేదా గ్లాస్ లైనర్లను వేయండి. ఏదైనా ఒలికినా నేరుగా ఫ్రిజ్ పాడవదు. కేవలం ఆ మ్యాట్‌ను తీసి కడిగేస్తే సరిపోతుంది. ఇది మీ పనిని 80% తగ్గిస్తుంది.

5. టూత్ పేస్ట్ – గ్యాస్కెట్ క్లీనింగ్:
ఫ్రిజ్ తలుపుకు ఉండే రబ్బర్ దగ్గర నల్లని మురికి పేరుకుపోతుంది. అక్కడ చిన్న బ్రష్‌తో కొంచెం వైట్ టూత్ పేస్ట్ రాసి రుద్దండి. ఇది మురికిని తొలగించడమే కాకుండా.. రబ్బర్ ఫ్లెక్సిబిలిటీని కాపాడుతుంది. తద్వారా కూలింగ్ బయటకు పోకుండా ఉంటుంది.

ఫ్రిజ్‌ను క్లీన్ చేసే ముందు ప్లగ్ తీయడం మర్చిపోకండి. అలాగే లోపల వస్తువులు సర్దేటప్పుడు గాలి ఆడేలా కొంచెం గ్యాప్ ఇవ్వండి. నెలకు కనీసం రెండు సార్లు ఇలా క్లీన్ చేస్తే మీ ఫ్రిజ్ ఏళ్ల తరబడి కొత్త దానిలా ఉంటుంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×