E-Paper
Advertisement

iOS 26.3 Beta 2: యాపిల్ iOS 26.3ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఏయే ఐఫోన్లకు సపోర్ట్ ఇస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో!

iOS 26.3 Beta 2: యాపిల్ iOS 26.3ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఏయే ఐఫోన్లకు సపోర్ట్ ఇస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

iOS 26.3 Beta 2: యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను మాటల్లో చెప్పలేము. లైఫ్‌లో ఒక్కసారైనా యాపిల్ ఐఫోన్ కొనాలి లేదా స్మార్ట్‌వాచ్ వాడాలి.. ఇలా యువత ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ ప్రొడక్ట్స్ యాపిల్. ఈ డిమాండ్‌కు తగ్గట్టే సంస్థ కూడా ప్రతిఏటా అప్డేటెడ్ వెర్షన్లలో తమ ఉత్పత్తులను విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు అలాంటిదే యాపిల్ లవర్స్ కోసం మరో సరికొత్త iOS అప్‌డేట్ సిద్ధమవుతోంది. గత ఏడాది యాపిల్ iOS 26 వెర్షన్‌ను విడుదల చేయగా.. ప్రస్తుతం స్టేబుల్ వెర్షన్‌గా iOS 26.2 కొనసాగుతోంది. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా iOS 26.3 వెర్షన్‌పై యాపిల్ పని చేస్తోంది. ఇప్పటికే ఈ అప్‌డేట్‌కు సంబంధించిన పబ్లిక్ బీటా వెర్షన్ కూడా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

సాధారణంగా iOS అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్, సిస్టమ్ మెరుగుదల, యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇవ్వడంపైనే ఆధారపడి రిలీజ్ అవుతుంటాయి. iOS 26.3 విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ వెర్షన్‌కు సంబంధించిన ఫస్ట్ డెవలపర్ బీటా గతేడాది డిసెంబరులో ప్రారంభమైంది. అప్పటి నుంచి లీక్‌లు, పుకార్ల రూపంలో కొత్త ఫీచర్లపై సమాచారం వెలుగులోకి వస్తూనే ఉంది.

iOS 26.3 రిలీజ్ ఎప్పుడు?

Advertisement

తాజా లీక్స్ ప్రకారం.. యాపిల్ iOS 26.3 అప్‌డేట్‌ను 2026 జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ పబ్లిక్ బీటా రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టరైన యూజర్లు ఇప్పటికే ఈ వెర్షన్‌ను ట్రై చేయవచ్చు. స్టేబుల్ వెర్షన్‌కు ముందు, బగ్స్ ఫిక్స్ చేయడానికి ఆపిల్ మరికొన్ని బీటా అప్‌డేట్స్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Also Read: పిల్లల కదలికపై ‘స్మార్ట్ బ్రిక్’ నిఘా.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

ఈ అప్డేట్ ఏయే ఐఫోన్లకు వర్తిస్తుంది?

Advertisement

iOS 26.3 అప్‌డేట్‌కు విస్తృత స్థాయిలో iPhone సపోర్ట్ ఇవ్వనున్నారు. iPhone 11 సిరీస్ నుంచి లేటెస్ట్ iPhone 17 సిరీస్ వరకు ఈ వెర్షన్ అందుబాటులోకి రానుంది. అయితే, అన్ని ఫోన్లకు అన్ని ఫీచర్లు లభిస్తాయనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అడ్వాన్స్‌డ్ ఫీచర్లు మాత్రం iPhone 15 Pro లేదా అంతకన్నా లేటెస్ట్ మోడల్స్‌లోనే పనిచేయనున్నాయి. ఈ నిర్ణ యం హార్డ్‌వేర్ పరిమితుల కారణంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

iOS 26.3 ద్వారా వచ్చే కొత్త మార్పేంటి?

ఈ అప్‌డేట్‌తో ఐఫోన్ యూజర్లకు కొన్ని కీలకమైన మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులభం కానుంది. ఇప్పటివరకు క్లిష్టంగా ఉన్న ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి డేటాను ఇకపై స్మూత్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సాఫీగా సాగాలంటే.. రెండు ఫోన్లు దగ్గరగా ఉంచుకోవడం అవసరం.

ఖచ్చితమైన వెదర్ అప్డేట్స్:

అలాగే, రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ మరింత ఖచ్చితంగా అందించేలా యాపిల్ ఈ వెర్షన్‌లో మార్పులు చేసింది. వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్, మార్పులు వెంటనే యూజర్లకు చేరేలా సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం. దీంతోపాటు.. ఐఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఇతర డివైజ్‌లకు పంపించే విషయంలో కూడా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ముఖ్యంగా థర్డ్ పార్టీ స్మార్ట్‌వాచ్‌లకు నోటిఫికేషన్ ఫార్వార్డింగ్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా.. యాపిల్ ఎకోసిస్టమ్‌ను మరింత ఓపెన్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

iOS 26.3 వల్ల ఉపయోగం ఏమిటి?

మరికొన్ని రోజుల్లో యూజర్లకు అందుబాటులోకి రానున్న iOS 26.3 అప్‌డేట్ పెద్ద డిజైన్ మార్పుల కంటే.. రోజువారీ వినియోగంలో వాడే ఫీచర్లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. డేటా ట్రాన్స్‌ఫర్ సులభం అవడం, రియల్ టైమ్ అప్‌డేట్స్, నోటిఫికేషన్ సపోర్ట్ వంటి అంశాలు iPhone యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ఛాన్స్ అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: మోటరోలా నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. 8.1 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆకట్టుకునేలా డిజైన్!

 

 

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×