E-Paper
Advertisement

Oppo Reno 15C: మిడ్ రేంజ్‌లో భారీ బ్యాటరీ, 12GB ర్యామ్.. ఒప్పో రెనో 15 సిరీస్‌లో బడ్జెట్ ఫోన్ లాంచ్

Oppo Reno 15C: మిడ్ రేంజ్‌లో భారీ బ్యాటరీ, 12GB ర్యామ్.. ఒప్పో రెనో 15 సిరీస్‌లో బడ్జెట్ ఫోన్ లాంచ్
Advertisement

Oppo Reno 15C| ఒప్పో కంపెనీ ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 15C 5Gని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, బలమైన కెమెరాలపై దృష్టి పెట్టింది. ఇందులో 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్.

ఒప్పో రెనో 15C 5G ధర, లభ్యత

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999. ఫిబ్రవరి నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. ఆఫ్టర్‌గ్లో పింక్, ట్వైలైట్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

Advertisement

ఒప్పో రెనో 15C 5Gలో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ 2372 × 1080 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 1400 నిట్స్ వరకు ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ సన్నగా ఉండి, 195 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంది. రోజువారీ ఉపయోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌OS 16తో వస్తుంది. స్మూత్ యానిమేషన్లు, మంచి స్టెబిలిటీ ఉంటాయి. 12GB వరకు LPDDR4x RAM 256GB UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ కెపాసిటీ

Advertisement

రియర్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌తో f/1.8 అపర్చర్ ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా స్పష్టంగా వస్తాయి. AI ఎన్‌హాన్స్‌మెంట్స్ వల్ల ఫోటోల క్వాలిటీ మెరుగుపడుతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీలో మోసం.. కొత్త ల్యాప్‌టాప్‌కు బదులు ఏం వచ్చిందంటే

బ్యాటరీ, చార్జింగ్, డ్యూరబిలిటీ

ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. తక్కువ సమయంలోనే ఫుల్ చార్జ్ అవుతుంది. కొత్త ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. ఈ కొత్త ఫోన్‌కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది.

కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు

అధునాతన 5G కనెక్టివిటీ ఉంది. డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ కూడా ఉంది. వై-ఫై 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లాంగ్ బ్యాటరీ, మంచి కెమెరాలు, స్మూత్ పనితీరు కలిగి ఉండటం వల్ల మిడ్-రేంజ్‌లో బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×