Smell Out Of Clothes: చలికాలం వచ్చిందంటే చాలు బట్టలు ఉతకడం ఒక పెద్ద పని అని భావిస్తుంటాం. ఈ సమయంలో చల్లటి నీళ్లలో బట్టలు ఉతకడం కష్టమైతే.. ఆరబెట్టడం అంతకంటే పెద్ద సమస్య. ఆరి ఆరని బట్టల నుంచి ఒక రకమైన ముక్కిపోయిన వాసన వస్తుంటుంది. ముఖ్యంగా జీన్స్, స్వెటర్లు, జాకెట్లు ప్రతి రోజూ ఉతకలేము. అలాంటప్పుడు నీటితో పని లేకుండానే.. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతో బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ పోగొట్టి, అవి ఫ్రెష్‌గా సువాసన వచ్చేలా చేసే అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం.
బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ పోగొట్టండిలా..
1. ఎండలో ఆరబెట్టడం:
చలికాలంలో ఎండ తక్కువగా ఉన్నా.. మధ్యాహ్నం పూట వచ్చే కాసేపు ఎండలో బట్టలను ఆరబెట్టండి. సూర్యరశ్మిలోని UV కిరణాలు బట్టలపై ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీని వల్ల బట్టల నుంచి వచ్చే చెడు వాసన సహజంగానే మాయమవుతుంది. బట్టలను తిరగేసి ఎండలో వేయడం మర్చిపోకండి.
2. బేకింగ్ సోడా మ్యాజిక్:
బేకింగ్ సోడా చెడు వాసనలను పీల్చుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది. వాసన వస్తున్న బట్టలపై కొంచెం బేకింగ్ సోడా చల్లి, ఒక గంట తర్వాత బ్రష్‌తో దులపండి. లేదా ఒక చిన్న క్లాత్ లో బేకింగ్ సోడా మూటగట్టి బీరువాలో ఉంచితే బట్టలు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయి.
3. వైట్ వెనిగర్ స్ప్రే:
ఒక స్ప్రే బాటిల్‌లో సమానంగా నీరు, వైట్ వెనిగర్ కలిపి బట్టల మీద తేలికగా స్ప్రే చేయండి. వెనిగర్ ఆరిపోయాక దాని వాసన ఉండదు. పైగా బట్టల నుంచి వచ్చే చెమట వాసనను ఇది పూర్తిగా పోగొడుతుంది. ఇది బట్టలను కడగకుండానే శుభ్రం చేసే సులభమైన పద్ధతి.
4. ఫ్రీజర్ ట్రిక్ :
మీ జీన్స్ ప్యాంట్ నుంచి వాసన వస్తుంటే.. దానిని ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి రాత్రంతా ఫ్రీజ్లో ఉంచండి. వినడానికి వింతగా ఉన్నా.. విపరీతమైన చలికి వాసన కలిగించే బ్యాక్టీరియా చనిపోతుంది. మరుసటి రోజు ఉదయం బయట పెడితే మీ జీన్స్ కొత్తదానిలా వాసన వస్తుంది.
5. వోడ్కా లేదా ఆల్కహాల్ స్ప్రే:
కాస్త ఖరీదైన చిట్కా అయినప్పటికీ.. వోడ్కాను నీటిలో కలిపి షర్ట్ చేతుల కింది భాగంలో స్ప్రే చేస్తే వాసన వెంటనే మాయమవుతుంది. ఇది చాలా త్వరగా ఆరిపోతుంది కాబట్టి బట్టలు తడిచిపోతాయనే భయం ఉండదు.
Also Read: మచ్చలను తొలగించే హోం మేడ్ సీరం.. సింపుల్‌గా తయారు చేసుకోండిలా !
6. ఆవిరి పట్టడం:
ఇంట్లో స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటే.. దానితో బట్టలకు ఆవిరి పట్టండి. వేడి ఆవిరి బట్టల పొరల్లోకి వెళ్లి దుర్వాసనను తొలగిస్తుంది. ఒకవేళ స్టీమ్ ఐరన్ లేకపోతే.. మీరు వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు ఆ గదిలో బట్టలు వేలాడదీస్తే.. ఆ వేడి ఆవిరికి వాసన తగ్గుతుంది.
7. ఎసెన్షియల్ ఆయిల్స్ :
లావెండర్ లేదా నిమ్మ నూనె వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలిపి బట్టలపై స్ప్రే చేస్తే మంచి సువాసన వస్తుంది. ఇది బ్యాక్టీరియాను అరికట్టడమే కాకుండా మీకు రోజంతా ఉత్సాహాన్నిస్తుంది.