E-Paper
Advertisement

iphone Under 40000: సూపర్ డీల్.. రూ.40000 కంటే తక్కువ ధరలో ఐఫోన్.. లిమిటెడ్ ఆఫర్

iphone Under 40000: సూపర్ డీల్.. రూ.40000 కంటే తక్కువ ధరలో ఐఫోన్.. లిమిటెడ్ ఆఫర్
Advertisement

iphone Under 40000| ఇయర్ ఎండ్ సేల్ సీజన్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. సరైన ఆఫర్ ఎంచుకుంటే వేల రూపాయలు ఆదా చేయొచ్చు. ఈ సేల్ లో లభిస్తున్న డీల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) ఇప్పుడు బెస్ట్ డీల్స్‌లో ఒకటి. దీన్ని రూ.40000 కంటే తక్కువ ధరలోనే ఇప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ఆపిల్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆప్షన్.

ఐఫోన్ 13 సాఫ్ట్‌వేర్ సపోర్ట్

ఐఫోన్ 13 దాదాపు నాలుగేళ్ల క్రితం లాంచ్ అయింది. అయినా ఇప్పుడు కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది. ఆపిల్ ఫోన్‌లకి ఎక్కువ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉంటుంది. మరో రెండు మూడేళ్లు స్మూత్‌గా వాడొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సేఫ్ ఛాయిస్.

ఒరిజినల్ ధర, సేల్ ధర ఎలా ఉంది?

Advertisement

ఐఫోన్ 13 (128GB) కంపెనీ ధర ఇప్పుడు రూ.49,900 ఉంది. అయితే విజయ్ సేల్స్‌లో ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ధర రూ.44,900కు తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు కూడా వినియోగించుకుంటే ధర మరింత తగ్గుతుంది.

ధర రూ.40 వేల కిందకి ఎలా వస్తుంది?

స్టోర్ ఫ్లాట్ రూ.5,000 డిస్కౌంట్ ఇస్తుంది. కొన్ని ఎలిజిబుల్ బ్యాంక్ కార్డ్స్‌తో మరో రూ.5,000 తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ.10,000 డిస్కౌంట్. ఫోన్ ఫైనల్ ధర రూ.39,900 అవుతుంది. ఇప్పటివరకు ఐఫోన్ 13 ఇంత తక్కువ ధరలో ఎప్పుడూ రాలేదు.

ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తున్న బ్యాంక్ కార్డ్స్‌ ఇవే..

Advertisement

ICICI, SBI, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌తో రూ.5,000 డిస్కౌంట్ వస్తుంది. డెబిట్ కార్డ్స్‌కి సాధారణంగా ఈ ఆఫర్ ఉండదు.

డిస్‌ప్లే, పర్ఫామెన్స్ ఎలా ఉంది?

ఐఫోన్ 13 లో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. రంగులు రిచ్‌గా, షార్ప్‌గా కనిపిస్తాయి. A15 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. రోజువారీ టాస్క్‌లు, గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి. యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి.

సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఎలా ఉంది?

లేటెస్ట్ iOS అప్‌డేట్స్ వస్తాయి. సెక్యూరిటీ, సిస్టమ్ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా దొరుకుతాయి. కానీ కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ లేవు. అవి కొత్త మోడల్స్‌కి మాత్రమే. రెగ్యులర్ యూజర్లకి పెద్ద లిమిటేషన్ ఉండదు.

కెమెరా పర్ఫామెన్స్ ఎలా ఉంది?

డ్యూయల్ 12MP రియర్ కెమెరాలు ఉన్నాయి. వైడ్, అల్ట్రావైడ్ షాట్స్ తీసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డే లైట్, లో లైట్‌లో షార్ప్ ఫోటోలు వస్తాయి. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి బాగుంది.

Also Read: సిసిటివి అవసరం లేదు.. మీ పాత ఫోన్‌‌‌తో సెక్యూరిటీ కెమెరా తయారు.. చాలా ఈజీ

ఇప్పుడు ఐఫోన్ 13 కొనడం సరైన నిర్ణయేమేనా?

బడ్జెట్‌లో ఐఫోన్ కావాలంటే ఇది బెస్ట్ డీల్. రోజువారీ యూజ్, ఫోటోగ్రఫీకి సూపర్. డిస్కౌంట్ వాల్యూ పెంచుతుంది. ఆఫర్ వాలిడిటీ, స్టాక్ చెక్ చేసి త్వరగా కొనండి. కొత్త ఐఫోన్ మోడల్స్ వచ్చినా.. ఐఫోన్ 13 ఫీచర్స్ ఇప్పటికే ఉపయోగకరంగానే ఉన్నాయి.

ఐఫోన్ 13 ఇప్పుడు రూ.39,900కి దొరకడం అద్భుతమైన ఆఫర్. బడ్జెట్ జీవులు ఐఫోన్ కొనాలంటే ఇదే సరైన సమయం.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×