E-Paper
Advertisement

Most Popular Smartphones 2025: ప్రపంచ అమ్మకాల్లో దూసుకెళ్లిన iPhone 16.. టాప్-10లో అసలు ఊహించని ఫోన్లు!

Most Popular Smartphones 2025: ప్రపంచ అమ్మకాల్లో దూసుకెళ్లిన iPhone 16.. టాప్-10లో అసలు ఊహించని ఫోన్లు!
Advertisement

Most Popular Smartphones 2025: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది ఆభరణంగా కాదు.. అది మన జీవితంలో ఒక అత్యవసరమైన సాధనంగా మారింది. ఆహారం, దుస్తులు, నివాసం, ఎడ్యుకేషన్ తర్వాత, అయిదో అవసరంగా స్మార్ట్‌ఫోన్ నిలిచింది. ఎందుకంటే.. కమ్యూనికేషన్, ఆన్‌లైన్ చదువు, బ్యాంకింగ్, షాపింగ్, ఉద్యోగాల కోసం స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎలాంటి పనులు జరగవు. ముఖ్యంగా ఆన్‌లైన్ కార్యకలాపాలు, డిజిటల్ సేవల వృద్ధితో ఫోన్ల వాడకం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘ప్రస్తుతం ఏ ఫోన్ ట్రెండింగ్‌లో ఉంది?’ అనే సందేహం మనలో చాలామందికి రావొచ్చు.  తాజాగా విడుదలైన గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ ప్రకారం.. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ‘iPhone 16’ నిలిచింది. అలాగే.. టాప్-10లో మరిన్ని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఆ వివరాలిలా..

ఐదు స్థానాల్లో యాపిల్ ఫోన్లు:

ఈ నేపథ్యంలో టాప్-10లో యాపిల్ ఫోన్లు 5 స్థానాల్లో.. శాంసంగ్ పోన్లు మరో 5 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీల మోడల్స్ ఈ మూడవ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు 20% వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా తొలి 5 స్థానాలను 5G స్మార్ట్‌ఫోన్‌లు ఆక్రమించాయి. ఇది మూడో త్రైమాసికానికి కొత్త రికార్డు. ఇకపోతు iPhone 16.. 4 శాతం మార్కెట్ వాటాతో టాప్-1 స్థానాన్ని పొందింది. వరుసగా మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. భారత్‌లో పండుగల సీజన్, ధర తగ్గింపు వంటివి iPhone 16 అమ్మకాలకు కలిసి వచ్చాయనే చెప్పాలి. ఇకపోతే.. అమెరికా, యూకే, చైనా వంటి కీలకమైన మార్కెట్లలో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అమ్మకాలు కాస్త తగ్గాయి. కానీ స్టాండర్డ్ ఐఫోన్ 16 సేల్స్ మాత్రం మెరుగ్గా ఉన్నాయి.

మరో ఐదు స్థానాల్లో శాంసంగ్:

Advertisement

ఇక టాప్-10 స్థానాల్లో 5 స్థానాలను శాంసంగ్‌ దక్కించుకుంది. గెలాక్సీ A సిరీస్ మోడల్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. గెలాక్సీ A16 5G అత్యధికంగా అమ్ముడైన మోడల్. AI ఫీచర్స్, బెస్ట్ క్వాలిటీ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల గెలాక్సీ A36, A56 వంటి మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, గెలాక్సీ ఏ16 4జీ, గెలాక్సీ ఏ06 వంటి LTE మోడల్స్ ఇప్పటికీ లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్లలో ప్రజాదరణ పొందుతున్నాయి. ఇక్కడ 4జీ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. మధ్యస్థశ్రేణి స్మార్ట్‌ఫోన్లలో జనరేటివ్ ఏఐ లక్షణాలకు పెరుగుతున్న ప్రజాదరణ వల్ల ఈ ఫోన్లు టాప్-10లో ఉన్నాయి.

2025లో అమ్ముడైన టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే..

1. ఐఫోన్ 16
2. శాంసంగ్ గెలాక్సీ A16 5G
3. ఐఫోన్ 16 ప్రో
4. ఐఫోన్ 16 ప్లస్
5. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్
6. శాంసంగ్ గెలాక్సీ A36
7. శాంసంగ్ గెలాక్సీ A56
8. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
9. శాంసంగ్ గెలాక్సీ A16 4G
10. శాంసంగ్ గెలాక్సీ A06

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×