E-Paper
Advertisement

Inzamam-ul-Haq: బుమ్రా బౌలింగ్ పై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు..బ్యాట్ లోనే కాదు బంతిలోనూ చిప్స్‌ పెట్టి, గెలిచారంటూ !

Inzamam-ul-Haq: బుమ్రా బౌలింగ్ పై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు..బ్యాట్ లోనే కాదు బంతిలోనూ చిప్స్‌ పెట్టి, గెలిచారంటూ !
Advertisement

Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026) భాగంగా నిన్న కొలంబో వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఎన్నో అంచనాల నడుమ ఈ మ్యాచ్ జరగగా, ఇండియా అద్భుతంగా రాణించింది. దీంతో పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో ఇండియా 176 పరుగుల టార్గెట్ పాకిస్తాన్ ముందు ఉంచింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్. 18 ఓవర్లు ఆడిన పాకిస్తాన్.. 114 పరుగులు చేసి, ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 61 పరుగులు తేడాతో విజయం సాధించింది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

పాకిస్తాన్ ఓటమిపై ఇంజమామ్ వుల్ హ‌క్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq). అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరూ సంచలన బ్యాటింగ్ చేస్తే బ్యాట్లలో చిప్పులు ఉన్నాయని ప్రచారం చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. అయితే నిన్న ప్రేమ దాస స్టేడియం వేదికగా టీమిండియా గెలిస్తే.. మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. టీమిండియా బౌలింగ్ చేసేటప్పుడు వాడిన బంతిలో చిప్ పెట్టారని.. బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్లే టీం ఇండియా గెలిచిందని బాంబు పేల్చారు.

బాల్ టాంపరింగ్, చిప్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడని సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవంగా ప్రేమ దాస స్టేడియం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.. కానీ టీమిండియాలో మాత్రం హార్దిక్ పాండ్యా , బుమ్రా వికెట్లు తీయడం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్. బాల్ టాంపరింగ్ జరిగిన కారణంగానే ఇండియా గెలిచిందన్నారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలని కోరారు ఇంజమామ్ వుల్ హక్. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ అదే స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు.

ఎలిమినేషన్ టెన్షన్ లో పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇంటిదారి పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఫిబ్రవరి 18వ తేదీన నమిబియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. అప్పుడు అమెరికా జట్టు సూపర్ 8లోకి ( Super 8) వెళుతుంది. ఇక నమీబియా పైన పాకిస్తాన్ గెలిస్తే ఈ టోర్నమెంట్లో సూపర్ 8లోకి వెళుతుంది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×