E-Paper
Advertisement

iPhone 16 Specifications Leaked: ఈ ఏడాదిలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్.. డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్!

iPhone 16 Specifications Leaked: ఈ ఏడాదిలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్.. డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్!
iPhone 16 update
iPhone 16

iPhone 16 Series Specifications and Design Leaked: ఐఫోన్లకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. కంపెనీ కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల సిరీస్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది. గతేడాది ఐఫోన్ 15 సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్‌ ఇలా మార్కెట్‌లోకి వచ్చిందో లేదో ఫోన్ ప్రియులు ఎగబడి కొనేశారు. అయితే ఈ ఏడాది వచ్చేసరికి ఫోన్ ప్రియులు iPhone 15 సిరీస్‌ను మరచిపోయారు.

ఇప్పుడు వారి ఫోకస్ iPhone 16పైకి మళ్లింది. ఇప్పుడు ఈ ఐఫోన్ 16 గురించే చర్చించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. రాబోయే ఐఫోన్‌ల గురించి ఇప్పుడు ఓ న్యూస్ బయటకొచ్చింది. కొన్ని లీకైన చిత్రాలు ఇప్పటికే ఐఫోన్ 16 మోడల్‌లు ఎలా కనిపిస్తాయనే దాని గురించి ఒక ఆలోచనను అందించాయి. అంతేకాకుండా వివిధ డిజైన్‌లు ఇంటర్నెట్‌లో తరచూ కనిపించి ఫోన్ ప్రియులు మంత్రముగ్దులను చేస్తున్నాయి.

అయితే ఇది 2024 సంవత్సరంలో ఐఫోన్‌ల తయారీలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లోని వెనుక భాగంలో కెమెరా ఇప్పుడు పిల్ లాంటి గుండ్రని ఆకారంలో ఉంటుందని లీక్ అయిన ఫొటోలు తెలుపుతున్నాయి. ఇక iPhone 16 Pro, iPhone 16 Pro Max ఫోన్లు మరింత పెద్దవిగా ఉండొచ్చని సమాచారం. ఇదే కనుక నిజమైతే.. ఈ మార్పులు ఫోన్‌ను మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: అమేజింగ్.. రూ.11 వేల 5జీ ఫోన్.. రూ.10,400 డిస్కౌంట్.. ఇది ఎవరూ ఊహించని ఆఫర్!

అంతేకాకుండా ఐఫోన్ 16 సిరీస్‌లోని నాలుగు మోడళ్లకు ఎడమ వైపున ‘యాక్షన్ బటన్’ అనే కొత్త బటన్ ఉంటుందని లీక్‌లో చెప్పబడింది. ఈ బటన్ ఇంతకు ముందు iPhone 15 Pro, iPhone 15 Pro Max మొబైల్స్‌లో ఇవ్వబడింది. అయితే ఈ బటన్ అనేది వీడియోలను చాలా ఈజీగా తీయడానికి సహాయపడుతుంది. ఈ బటన్ ‘హాప్టిక్ ఫీడ్‌బ్యాక్’ అనే ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఈ బటన్‌ను ప్రెస్ చేసినపుడు వైబ్రేషన్ అనుభూతి కలుగుతుంది. ఈ ఏడాదిలో వచ్చే అన్ని iPhone 16 మోడళ్లలో సాధారణ లైట్నింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్-సి పోర్ట్‌ను కూడా చూడవచ్చు. ఇకపోతే ఈ ఏడాది వస్తున్న ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే అత్యంత ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9 అంగుళాల అత్యంత పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

Tags

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×