BigTV English

Kuna Srisailam Goud joined Congress: బీజేపీకి ఊహించని షాక్, కాంగ్రెస్‌లోకి శ్రీశైలం గౌడ్!

Kuna Srisailam Goud joined Congress: బీజేపీకి ఊహించని షాక్, కాంగ్రెస్‌లోకి శ్రీశైలం గౌడ్!
BJP leader Kuna Srisailam Goud joined in the Congress
BJP leader Kuna Srisailam Goud joined in the Congress

BJP Leader Srisailam Goud Joins in Congress Party: మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటుపై ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఇక్కడ విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


తాజాగా బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఓసారి గెలిచారు. ఆ ప్రాంతంలో గట్టి పట్టుకున్న నేత కూడా. అంతేకాదు మాస్ లీడర్‌గా కూన శ్రీశైలంగౌడ్ మాంచి పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లక్షకు పైగా ఓట్లు వచ్చాయంటే కేవలం ఆయన దయవల్లేనని మద్దతుదారులు బలంగా చెబుతారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. శ్రీశైలంగౌడ్ రావడంతో కాంగ్రెస్ గెలుపు తేలిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు కూన శ్రీశైలంగౌడ్ పార్టీ మారడం బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. శ్రీశైలంగౌడ్ ఉన్నారన్న ఆలోచనతో అక్కడి నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో  ఏం చేయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయారు ఈటెల. అంతేకాదు నియోజకవర్గంలో ఈటెల ప్రచారానికి అక్కడక్కడ అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైనా గెలుస్తామనే ఆయన ఆలోచన తలకిందులైంది.


Also Read: డ్రగ్స్ కు బానిసై.. తండ్రిని తగలబెట్టిన కసాయి కొడుకు

2009 నుంచి ఇప్పటివరకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకసారి టీడీపీ విజయం సాధించింది. దీని పరిధిలోకి మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో సెటిలర్ల ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×