Buy Motorola G34 5G Smart Phone at Rs 599 Only: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఎప్పుడెప్పుడు స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయా అని చాలా మంది ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ తాజా ఆఫర్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని అత్యంత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ బచాత్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పలు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే.. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ మోటోరోలా జీ34 5జీ మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లతో అత్యంత తక్కువ ధరకే ఫోన్ కొనుక్కోని ఇంటికి పట్టికెళ్లొచ్చు.
మోటోరోలా జీ34 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ధర రూ. 13,999 ఉండగా.. ఇప్పుడు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో 21 శాతం డిస్కౌంట్‌తో 10,999కి లిస్ట్ అయింది. అలాగే దీని 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,999 ఉండగా ఇప్పుడు 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,999లకి కొనుక్కోవచ్చు.
Also Read: వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!
అంతేకాకుండా వీటిపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. SBI క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుక్కుంటే అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. దీని 4/128జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.10,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఎక్స్ఛంజ్ డిస్కౌంట్‌తో ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ.599లకే కొనుక్కోవచ్చు.
అలాగే 8/128జీబీ వేరియంట‌్‌పై రూ.11000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.999లకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను పూర్తిగా పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. లేదంటే మరికొంత అమౌంట్‌ని మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది.