iPhone 17 Pro Discount| ఆపిల్ ఇటీవల విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఐఫోన్ 17. ఈ సిరీస్ ఐఫోన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుండగా.. ఆ సమయం రానే వచ్చింది. అయితే ఐఫోన్ 17 ప్రోపై ఒకేసారి రెండు డిస్కౌంట్ ఆఫర్లు వచ్చాయి. అమెజాన్, విజయ్ సేల్స్ వంటి పెద్ద రిటైలర్లు రెండు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించాయి. ఈ డీల్స్‌తో ప్రీమియం ధర గల ఈ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి కాబట్టి త్వరగా షాపింగ్ చేయండి!
256GB వేరియంట్ ధర రూ.1,34,900 మాత్రమే. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 తక్షణ డిస్కౌంట్ + నో-కాస్ట్ EMIతో మరో రూ.2,000 నుంచి రూ. 4,000 ఆదా చేసుకోవచ్చు. మొత్తం రూ.6,000 నుంచి రూ.8,000 వరకు డిస్కౌంట్.
విజయ్ సేల్స్ లో కూడా దాదాపు అమెజాన్ లాంటి డీల్ ఉంది. ICICI, SBI & IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ + ఎక్స్‌ఛేంజ్ బోనస్ + ఇతర బ్యాంక్ ఆఫర్లతో మొత్తం రూ.10,000 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో 90 నిమిషాల్లో డెలివరీ, ఆఫ్‌లైన్ స్టోర్‌లో వెంటనే తీసుకెళ్లవచ్చు.
iPhone 17 Proలో 6.3 అంగుళాల OLED Super Retina XDR డిస్‌ప్లే ఉంది. 120Hz ప్రమోషన్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ అత్యంత స్మూత్‌గా సాగుతుంది. అత్యంత పవర్‌ఫుల్ A19 Pro చిప్‌సెట్ మల్టీటాస్కింగ్, AI ఫీచర్లు, హెవీ గేమింగ్‌ను సులువుగా నిర్వహిస్తుంది.
ట్రిపుల్ రియర్ కెమెరాలో ప్రధాన 48MP సెన్సార్, అల్ట్రా-వైడ్ & టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. లో-లైట్‌లో అద్భుత ఫోటోలు, 8K వీడియో రికార్డింగ్ సాధ్యం. 18MP ఫ్రంట్ కెమెరాతో సెంటర్ స్టేజ్ ఫీచర్ వీడియో కాల్స్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫర్లు, వీడియో క్రియేటర్లకు బెస్ట్ ఛాయిస్.
వైబ్రెంట్ OLED డిస్‌ప్లే బయట ఎండలో 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. A19 Pro చిప్ వల్ల PUBG, Genshin Impact వంటి హై-ఎండ్ గేమ్స్ స్మూత్‌గా ఆడొచ్చు.
హెవీ యూసేజ్‌లోనూ పూర్తి రోజు నిలుస్తుంది. 45W ఫాస్ట్ చార్జింగ్ + వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పవర్ మేనేజ్‌మెంట్ అత్యంత ఎఫీషియెంట్.
ప్రీమియం ఫోన్‌కు డబుల్ డిస్కౌంట్ ఆఫర్స్. 7-8 ఏళ్లు iOS అప్‌డేట్స్ గ్యారంటీ, రీసేల్ వాల్యూ ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ప్రస్తుత ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే. మీరు ప్రీమియం iPhone కొనుగోలు చేయలానుకుంటే ఇదే సరైన సమయం – వెంటనే బుక్ చేయండి!
Also Read: షాకింగ్ ఆఫర్.. ఈ సంవత్సరంలో విడుదలైన కొత్త ఐఫోన్‌పై రూ.18,000 తగ్గింపు