E-Paper
Advertisement

Aadhaar Big Update: ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్.. ఇకపై కొత్త రూల్స్, వచ్చే నెల నుంచి అమలు

Aadhaar Big Update: ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్.. ఇకపై కొత్త రూల్స్, వచ్చే నెల నుంచి అమలు
Advertisement

Aadhaar Big Update: ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్. వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. దీనివల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు. ఈ విషయాన్ని ఉడాయ్ సీఈఓ భువనేష్‌కుమార్ ఆన్‌లైన్ వేదికగా మనసులోని మాట బయటపెట్టారు. ఇంతకీ అసలు మేటరేంటి? ఎలా చేయబోతున్నారు? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్

Advertisement

ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు, పథకాలు.. ఇలా ఎక్కడికి వెళ్లి ఏది చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి చేశాయి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డుని తీసుకుని వెళ్తున్నారు సగటు వినియోగదారులు. ప్రతీసారి జెరాక్సుల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని తగ్గించుకునేందుకు ఇటీవల ఉడాయ్ ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది.  అయినా జెరాక్సు షాపుల వద్ద ఆధార్ డేటా మిస్సవుతుందని వార్తల నేపథ్యంలో భారత విశిష్ఠ‌ గుర్తింపు ప్రాధికార సంస్థ-Uidai కీలక నిర్ణయం తీసుకుంది.

రానున్న రోజుల్లో ఆధార్ కార్డు స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఇక కార్డుపై కేవలం వ్యక్తి ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించనుంది. గతంలో మాదిరిగా ఆధార్ నెంబర్ కనిపించదు. వ్యక్తిగత అడ్రస్, వయస్సు వంటికి కార్డుపై ఏ మాత్రం కనిపించవు. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఆ సంస్థ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ ఆన్‌లైన్ వేదికగా తెలిపారు. ఈ విషయమై ఆయన.. బ్యాంకులు, హోటళ్లు, ఫిన్‌టెక్ సంస్థల ప్రతినిధులతో జామ్ సమావేశం నిర్వహించారు. ఆయా వివరాలను షేర్ చేశారు.

Advertisement

వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలు

ఆధార్ కార్డు అనేది వ్యక్తికి గుర్తింపు నెంబరు మాత్రమే. అనవసరమైన వివరాలు ఎందుకుండాలనే ఆలోచనతోనే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే డిసెంబరు ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆఫ్‌లైన్‌ పేరుతో ఆధార్ కార్డు ఫొటో కాపీలను తీసుకుని భద్రపరుస్తున్నాయి. ఆధార్ చట్టానికి విరుద్ధమని ఆయన ఆలోచన. ఈ నేపథ్యంలో డిసెంబర్ ఒకటి నుంచి ఆ తరహా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ పద్ధతులను చెక్ పడనుంది.  ఆధార్‌ను డాక్యుమెంటు మాదిరిగా కాకుండా, క్యూఆర్ కోడ్ ద్వారా నెంబరు ధ్రువీకరించాలని సూచన చేశారు.

ALSO READ: హిందూ మహిళల ఆస్తి పంపకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మార్పులతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఉడాయ్. ప్రస్తుతం ఎం-ఆధార్ స్థానంలో కొత్త యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఉండనుంది. దీని సాయంతో వినియోగదారులు స్వయంగా తమ చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను సులభంగా మార్చుకునే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తోంది ఉడాయ్.  మరో 18 నెలల్లో పూర్తిగా పని చేయగలదని భావిస్తున్నారు. ఆధార్‌ని డాక్యుమెంట్‌గా ఉపయోగించకూడదు. దాని నెంబర్‌తో మాత్రమే ప్రామాణీకరించాలి. లేకుంటే QR కోడ్‌ని ఉపయోగించి ధృవీకరించాలి. లేకపోతే అది నకిలీ అయ్యే ఛాన్స్ ఉందన్నది కుమార్ మాట.

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×