E-Paper
Advertisement

iPhone 17 Pro Expensive: ఐఫోన్ 17 ప్రో ధర పెరగబోతోంది.. త్వరగా కొనేయండి.. ఎందుకంటే

iPhone 17 Pro Expensive: ఐఫోన్ 17 ప్రో ధర పెరగబోతోంది.. త్వరగా కొనేయండి.. ఎందుకంటే
Advertisement

iPhone 17 Pro Expensive| కొన్ని నెలల క్రితమే విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ లో హై ఎండ్ మోడల్ ఐఫోన్ 17 ప్రో ధర ఇటీవలే తొలిసారి ధర తగ్గింది. ఈ ఫోన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే తాజా డిస్కౌంట్ ఈ ప్రీమియం ఐఫోన్‌ను మరింత ఆకర్షణీయం చేస్తోంది. ఆపిల్ లాంచ్ తర్వాత ఇంత త్వరగా ధరలు తగ్గించడం అరుదు. బయర్లు ఇప్పుడు గణనీయమైన మొత్తం సేవ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ రెండింటిలోనూ ఎక్సైటింగ్ డీల్స్ ఉన్నాయి. అయితే త్వరలోనే ఐఫోన్ 17 ప్రో ధరని ఆపిల్ పెంచబోతోందని సమాచారం.

ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా DRAM చిప్ కొరతతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ (DRAM) ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ కొరత ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీదారులందరినీ ప్రభావితం చేస్తోంది. ఆపిల్ లాభాలు తగ్గుతున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌పై ఈ ఒత్తిడి తొలిగా పడుతుంది. ర్యామ్ ఖర్చు పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.

వేగంగా పెరుగుతున్న DRAM ధరలు

Advertisement

తాజా రిపోర్ట్ ప్రకారం.. LPDDR5X ర్యామ్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో 12GB LPDDR5X ర్యామ్ ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక యూనిట్ ధర 25-29 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు అదే ర్యామ్ దాదాపు 70 డాలర్లకు చేరింది. ఇది సుమారు 230 శాతం పెరుగుదల. ఈ ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను ప్రభావితం చేస్తోంది.

ధరలు పెంచే ఆలోచనలో ఆపిల్

ఆపిల్ సాధారణంగా పెరిగిన కాంపోనెంట్ ఖర్చులను తనే భరిస్తుంది. ఇది కస్టమర్లకు ధరలు పెంచకుండా రక్షిస్తుంది. లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్స్ ద్వారా ధరలను లాక్ చేసుకుంటుంది. గతంలో ఇదే ధోరణి ఆపిల్‌ మార్కెట్ వాటాను కాపాడింది. కానీ ప్రస్తుత DRAM ధరల పెరుగుదల చాలా తీవ్రంగా ఉంది. గత సైకిల్స్ కంటే ఈసారి ఎక్కువ ఒత్తిడి ఉంది.

త్వరలో ముగియనున్న సప్లై అగ్రిమెంట్స్

Advertisement

రిపోర్ట్ ప్రకారం.. ఆపిల్ సప్లై కాంట్రాక్ట్స్ జనవరి 2026లో ముగుస్తాయి. ఆపిల్ ర్యామ్‌ను శామ్‌సంగ్, ఎస్కే హైనిక్స్.. లాంటి కంపెనీల నుంచి కొనుగోలు చేస్తుంది. కాంట్రాక్ట్స్ ముగిసిన తర్వాత ప్రస్తుత మార్కెట్ ధరలను సవరించాల్సిన పరిస్థితి. పాత ధరలో (25 డాలర్లు) ఒప్పందం చేసుకోవడం కష్టమని నిపుణులు అభిప్రయాపడుతున్నారు.

హై-మార్జిన్ చిప్ దిశగా మారుతున్న మెమరీ తయారీదారులు

శామ్‌సంగ్, ఎస్కే హైనిక్స్, మైక్రాన్ వంటి కంపెనీలు LPDDR మెమరీ తయారీని తగ్గిస్తున్నాయి. బదులుగా హై-మార్జిన్ HBM మెమరీపై దృష్టి పెడుతున్నాయి. HBMకు ఏఐ యాక్సిలరేటర్లు, డేటా సెంటర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో స్మార్ట్‌ఫోన్లకు LPDDR అందుబాటు తగ్గుతోంది. అంటే మెమరీ చిప్ ల వినియోగం ఏఐ కోసం ఎక్కువగా జరుగుతోంది.

చిప్‌ల కోసం ఎక్కువ శామ్‌సంగ్‌పై ఆధారపడుతున్న ఆపిల్

ఆపిల్ ర్యామ్ సప్లైకి శామ్‌సంగ్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. శామ్‌సంగ్ LPDDR ర్యామ్ చిప్‌లను పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఒకే సప్లయర్‌పై ఆధారపడటం వల్ల ఆపిల్ బార్గెయినింగ్ పవర్ తగ్గుతుంది. సప్లయర్ ఆప్షన్లు తక్కువగా ఉండటం ధరలు మరింత పెంచవచ్చు.

Also Read: ఐఫోన్ 17 ప్రోపై తొలిసారి భారీ డిస్కౌంట్.. బెస్ట్ డీల్స్ ఎక్కడంటే

భవిష్యత్ ఐఫోన్ డిజైన్లకు ఎక్కువ ర్యామ్ అవసరం

టెక్ వర్గాల ద్వారా అందిన సమాచారం  ప్రకారం ఐఫోన్ 18 సిరీస్‌లో ఆరు-ఛానెల్ LPDDR5X మెమరీ ఉండవచ్చు. ఇది బ్యాండ్‌విడ్త్, ఏఐ పర్ఫామెన్స్ మెరుగుపరుస్తుంది. ఎక్కువ పర్ఫామెన్స్ కోసం ఎక్కువ డ్రామ్ కావాలి. ఇది ఆపిల్ తయారీ ఖర్చును మరింత పెంచుతుంది.

ఐఫోన్ ధరలు పెరుగుతాయా?

ఆపిల్ బలమైన ఫైనాన్షియల్ రిజర్వ్స్ కలిగి ఉంది. కానీ ధరల పెంపు ఎక్కువ కాలం భరించలేదు. ర్యామ్ ధర 70 డాలర్ల వద్ద ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆపిల్ ఆ పెరిగిన ఖర్చును కొంత కస్టమర్లపై వేయవచ్చు. భవిష్యత్ ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం మోడల్స్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది.

కస్టమర్లపై ప్రభావం

కాంపోనెంట్ ఖర్చు పెరిగితే రిటైల్ ధరలు పెరుగుతాయి. రాబోయే ఐఫోన్ మోడల్స్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. అధిక ర్యామ్ కలిగిన ఫ్లాగ్‌షిప్ డివైస్‌లు ఎక్కువ ధర పెరుగుదలను ఎదుర్కొంటాయి. ధరలు, మార్కెట్ కంపిటీటివ్‌నెస్ మధ్య ఆపిల్ బ్యాలెన్స్ చేయాలి. అందుకే త్వరలోనే ధరల పెంపు ఉండొచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×