E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు 

Today Horoscope in Telugu: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు 
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 25వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపారమున  విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం  మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.  సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. 

వృషభం

Advertisement

నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. ఆర్థిక  పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

మిథునం

వ్యాపార విషయమై  కీలక   నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక  పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల  నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

కర్కాటకం

Advertisement

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా  సాగుతాయి. సన్నిహితులతో దైవ దర్శనాలు  చేసుకుంటారు. కుటుంబ  సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి  ఒప్పందాలు అంతగా కలిసిరావు.

సింహం

స్ధిరాస్తి కొనుగోలు  ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.  వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో   చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి.  దైవ చింతన పెరుగుతుంది. 

కన్య

ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.   నిరుద్యోగ ప్రయత్నాలు   మందగిస్తాయి. వ్యాపార వ్యవహారాలు   నిరుత్సాహ పరుస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

విద్యార్థులు  పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. ఇంటా బయట  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

వృశ్చికం

చేపట్టిన   పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ధనుస్సు

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ పెద్దల నుండి  ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో  స్వల్ప  వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.

మకరం

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.  నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణ యత్నాలు మందగిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.  దైవ  కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.  

కుంభం

నిరుద్యోగులకు   సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు  లభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను  సమర్దవంతంగా నిర్వహిస్తారు.  ప్రేమికులకు అనుకూలమైన రోజు.  వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు.

మీనం

వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగమున అధికారులతో  వాదనలకు వెళ్లకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×