E-Paper
Advertisement

iPhone 17e Release Date: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17e విడుదల తేదీ, ఫీచర్లు, ధర వివరాలివే!

iPhone 17e Release Date: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17e విడుదల తేదీ, ఫీచర్లు, ధర వివరాలివే!
Advertisement

iPhone 17e Release Date: యాపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026లో తమ తొలి భారీ ఈవెంట్‌కు యాపిల్ ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 4న జరగనున్న ఈ గ్రాండ్ లాంచ్‌లో అందరి కళ్లు iPhone 17eపైనే ఉంటాయి. సాధారణంగా ఐఫోన్ కొనాలంటే మన వద్ద భారీ డబ్బులు ఉండాల్సిందే అని చాలామంది భయపడుతుంటారు. కానీ ఈసారి యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత సరసమైన ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు కొత్త మ్యాక్‌బుక్ వెర్షన్లను కూడా అదే వేదికపై పరిచయం చేయనున్నారు.

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు:

ఇక ధర విషయానికి వస్తే.. భారతీయ మార్కెట్లో iPhone 17e సుమారు రూ.60 వేల నుంచి రూ.65 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో 599 డాలర్లు, దుబాయ్‌లో 2,199 దిర్హామ్స్‌గా దీని ధర ఉండవచ్చని అంచనా.

Advertisement

Also Read: భూకంపాన్ని ముందే చెప్పేసే స్మార్ట్ వాచ్.. ఇక ఫోన్‌తో పని లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్:

ప్రీమియం ఫీచర్లను కోరుకుంటూనే బడ్జెట్ పరిమితులు ఉన్నవారికి ఈ ఐఫోన్ 17e సరైన ఎంపిక అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటూ లావెండర్, బ్లాక్, వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులను అలరించనుంది.

 ఏ19 చిప్‌ సెట్:

Advertisement

ఈ ఫోన్ కేవలం చూడటానికే కాదు.. పనితీరులో కూడా ది బెస్ట్ అనిపించుకుంటుంది. దీనిలో యాపిల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన ఏ19 చిప్‌ను అమర్చారు. దీంతో ఫోన్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 8GB RAM, 128GB స్టోరేజ్ వంటి ఫీచర్లు యూజర్లకు మంచి అనుభూతిని ఇస్తాయి.

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు:

ఇకపోతే ఐఫోన్ అంటేనే ఫొటో క్వాలిటీకి పెట్టింది పేరు. ఐఫోన్ 17eలో వెనుక వైపు 48 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు రోజంతా ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా 4005mah బ్యాటరీని కూడా ఈ ఫోన్‌లో అమర్చారు.

Also Read: లక్ష రూపాయల ఫోన్ సగం ధరకే.. మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై కళ్లుచెదిరే ఆఫర్!

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×