Motorola Razr 60 Ultra Price Drop: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా స్టైలిష్‌గా ఉండే ఫ్లిప్ ఫోన్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు క్రేజీ డీల్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన Razr 60 Ultraపై ఇప్పుడు కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఫీచర్లతో అలరించే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర దాదాపు లక్ష రూపాయల వరకు ఉండేది. కానీ ప్రస్తుత సేల్‌లో ఈ ధర రూ.80,000కు పడిపోయింది. అంతేకాదు.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా రూ.10వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే.. ఈ ఫోన్‌ను రూ. 69,500కే దక్కించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ ఉండి, అది మంచి కండిషన్‌లో ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ధరను ఇంకా తగ్గించుకునే వీలుంది. బడ్జెట్ ఇబ్బంది ఉన్నవారికి తక్కువ ధరకే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
ఈ ఫోన్ కేవలం చూడటానికే కాదు.. పనితీరులోనూ అద్భుతం అనిపిస్తుంది. దీనిలో 7.0 అంగుళాల భారీ ఫోల్డబుల్ అమోల్డ్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి.. గేమింగ్ లేదా వీడియోలు చూసేటప్పుడు చాలా మెరుగైన అనుభూతిని అందిస్తుంది.
Also Read: వర్త్ వర్మా వర్త్.. శాంసంగ్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ AI ఇయర్‌బడ్స్ వచ్చేశాయ్!
ఫోన్ లోపల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. 16GB RAM, 512GB స్టోరేజ్ సామర్థ్యం దీనికి అదనపు బలం అని చెప్పాలి. ఇక బయట ఉండే చిన్న స్క్రీన్ ద్వారా ఫోన్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్లు చూసుకోవచ్చు.
ఇకపోతే ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ Motorola Razr 60 Ultraలో 50MP మెయిన్ సెన్సార్‌తో పాటు మరో 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. దీంతో ఈ ఫోన్ ద్వారా అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
ఛార్జింగ్ విషయానికి వస్తే.. 4,700mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఫోన్‌ను చాలా త్వరగా రీఛార్జ్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉండటంతో వినియోగం మరింత సులభమవుతుంది. స్టైల్, టెక్నాలజీ కలగలిసిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ.30వేల వరకు ధర తగ్గడం అనేది నిజంగా గొప్ప విషయమే.
Also Read: ఐఫోన్ 18 ప్రోలో ఊహించని మార్పులు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?