iPhone 18 Pro| టెక్ దిగ్గజం ఆపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి తాజాగా లీక్స్ వచ్చాయి. MacRumorsలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. GF Securities అనలిస్ట్ జెఫ్ పు 2026లో రాబోయే పెద్ద మార్పులు లీక్స్ చేశాడు. చెప్పాడు. డిజైన్, కెమెరా, ప్రాసెసర్, కనెక్టివిటీ వంటి ఫీచర్లలో భారీ మార్పులుంటాయి.
iPhone 18 Proలో డైనమిక్ ఐల్యాండ్ చాలా చిన్నగా ఉండవచ్చు. Face ID భాగాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఫ్లడ్ ఇల్యూమినేటర్ డిస్‌ప్లే కిందకు వెళ్లవచ్చు. దీనివల్ల స్క్రీన్‌లో ఎక్కువ స్థలం ఖాళీగా ఉంటుంది. కొన్ని రిపోర్టుల్లో అండర్-డిస్‌ప్లే Face ID గురించి కూడా చెప్పారు. అప్పుడు కేవలం ఒక చిన్న కెమెరా హోల్ మాత్రమే కనిపిస్తుంది.
కెమెరాలో అతిపెద్ద మార్పు వేరియబుల్ అపర్చర్ టెక్నాలజీ. దీనితో లైట్ ఎంత రావాలో మాన్యువల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ సులభంగా మార్చవచ్చు. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మెయిన్ కెమెరా 48MP ఫ్యూజన్ సెన్సార్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్‌కు పెద్ద అపర్చర్ రావచ్చు. టెలికన్వర్టర్ సపోర్ట్ వస్తే ఆప్టికల్ జూమ్ మరింత బాగుంటుంది. సెల్ఫీ కెమెరా 24MPకి పెరుగుతుంది. దీనివల్ల సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా మెరుగవుతాయి.
iPhone 18 Proలో A20 Pro చిప్ ఉండవచ్చు. ఇది TSMC 2nm టెక్నాలజీతో తయారవుతుంది. ఇది చిన్నగా, ఎఫిషియంట్‌గా ఉంటుంది. పనితీరు 15 శాతం వేగంగా ఉండవచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ 30 శాతం మెరుగవుతుంది. దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది.
ఫోన్‌లో Apple N2 చిప్ ఉండవచ్చు. ఇది Wi-Fi, Bluetooth, Thread రేడియోలను నియంత్రిస్తుంది. గతంలో N1 చిప్ ఉండేది. N2తో AirDrop, హాట్‌స్పాట్ మెరుగవుతాయి. Apple C2 మోడెమ్ కూడా రావచ్చు. ఇది క్వాల్‌కామ్ మోడెమ్‌ల స్థానంలో వస్తుంది. పవర్ తక్కువ ఖర్చవుతుంది. శాటిలైట్, నెట్‌వర్క్ పర్‌ఫామెన్స్ మెరుగవుతుంది.
iPhone 18 Pro Maxలో ఇప్పటివరకు లేని అతిపెద్ద బ్యాటరీ ఉండవచ్చు. సామర్థ్యం 5,100 నుంచి 5,200mAh వరకు ఉండవచ్చు. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఎక్కువ సమయం ఇస్తుంది.
Also Read: టివి వినియోగంతో పెరిగిపోతున్న కరెంట్ బిల్లు.. ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి
Pro మోడల్‌కు 6.3 ఇంచ్ డిస్‌ప్లే, Pro Maxకు 6.9 ఇంచ్ డిస్‌ప్లే రావచ్చు. రెండింటిలోనూ గ్లాస్ బ్యాక్ ఉంటుంది. Pro Max 240 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండవచ్చు. ఇది ఇప్పటివరకు అతి బరువైన iPhone అవుతుంది.
iPhone 18 Pro ధర సుమారు $1,099 నుంచి మొదలవుతుంది. Pro Max అంచనా ధర $1,199 ఉండవచ్చు. కొత్త కలర్స్‌లో బ్రౌన్, బర్గండీ రావచ్చు. పర్పుల్ కలర్ మళ్లీ తిరిగి వస్తుంది.
iPhone 18 Proలో కెమెరా కంట్రోల్, పర్‌ఫామెన్స్, బ్యాటరీ లైఫ్‌లో పెద్ద మెరుగుదలలు ఉంటాయి. Apple బయటి చిప్ కంపెనీలపై ఆధారపడటం తగ్గిస్తోంది. ఇది ఫోన్‌ను మరింత ఎఫిషియంట్‌గా, ఫ్యూచర్‌కు సిద్ధంగా చేస్తుంది. ఐఫోన్ 18 ప్రో.. Apple యొక్క అత్యంత అడ్వాన్స్ ఫ్లాగ్‌షిప్ అవుతుంది.