Apple iPhone: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iPhone 18 Pro Max ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ చర్చకు దారితీస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, కెమెరా సిస్టమ్, డిజైన్ అంశాలు లీక్‌ల రూపంలో వెలుగులోకి రావడంతో.. ఇది మరోసారి ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను 2026 సెప్టెంబర్ రెండో వారంలో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని సమాాచారం. అదే సమయంలో iPhone 18 Proతో పాటు ఫోల్డబుల్ డివైస్‌గా ప్రచారంలో ఉన్న iPhone Foldను కూడా ఆపిల్ లాంచ్ చేయవచ్చని చర్చ సాగుతోంది. ఇక ధర విషయానికి వస్తే,.. ఈ ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్‌కి సుమారుగా రూ.1,64,900 ధర ఉండొచ్చని రూమర్స్ సూచిస్తున్నాయి.
డిజైన్ పరంగా చూస్తే.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ గతంలో వచ్చిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లుక్‌ను చాలా వరకు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈసారి యూజర్లను ఆకట్టుకునేలా ఒకటి లేదా రెండు కొత్త కలర్ ఆప్షన్లను ఆపిల్ పరిచయం చేయవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లాసీ ఫినిష్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో ఈ ఫోన్ మరోసారి హైఎండ్ యూజర్లను టార్గెట్ చేయనుందని తెలుస్తోంది.
Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7000mAh బ్యాటరీ, రెండు హై రిజల్యూషన్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్!
కెమెరా విభాగంలో ఈ ఫోన్ పెద్ద అప్‌గ్రేడ్‌తో రానుందని లీక్స్ చెబుతున్నాయి. iPhone 18 Pro Maxలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. దీనిలో 48MP ప్రైమరీ కెమెరా, 48MP పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వవచ్చని సమాచారం. ఈ సెటప్‌తో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుభూతిని మరింత ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లేలా ఆపిల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 24MP ఫ్రంట్ కెమెరా అందించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అగ్రశ్రేణి అనుభూతిని ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ప్రోమోషన్ సపోర్ట్‌తో సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావొచ్చని సమాచారం. దీనివల్ల విజువల్స్ మరింత స్మూత్‌గా, ప్రీమియంగా కనిపించే అవకాశం ఉంది. అలాగే, ఈ డివైస్‌లో ఆపిల్ తాజా A20 Pro చిప్‌సెట్ను ఉపయోగించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. స్టోరేజ్ పరంగా కనీసం 256GB నుంచి ఆపిల్ కొనసాగించే అవకాశముందని, ఇది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తరహాలోనే ఉండొచ్చని తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. కొత్త వెర్షన్ Siri వాయిస్ అసిస్టెంట్, అలాగే రాబోయే iOS AI అప్‌డేట్స్ ఈ డివైస్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. సిరి మరింత స్మార్ట్‌గా, యూజర్ అవసరాలకు అనుగుణంగా స్పందించేలా అప్‌గ్రేడ్ చేయనున్నారని లీక్స్ సూచిస్తున్నాయి. ఈ AI ఫీచర్లు iPhone 18 Pro Max యూజర్ అనుభూతిని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అన్ని కారణాలతోనే iPhone 18 Pro Max ప్రస్తుతం టెక్ ప్రపంచంలో టాప్ ట్రెండింగ్ డివైస్‌గా నిలుస్తోంది. 48MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్, పెరిస్కోప్ జూమ్, శక్తివంతమైన A20 Pro చిప్, అలాగే కొత్త Siri, iOS AI ఫీచర్లపై వస్తున్న లీక్స్ సోషల్ మీడియా, టెక్ టాక్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ ఫోన్‌పై అంచనాలు మాత్రం ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి.
Also Read: బడ్జెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.వెయ్యి లోపే Ai+ నోవాపాడ్స్ హెల్త్ ట్రాకింగ్ ఇయర్‌బడ్స్!