E-Paper
Advertisement

Oppo Reno 15C: ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7000mAh బ్యాటరీ, రెండు హై రిజల్యూషన్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్!

Oppo Reno 15C: ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7000mAh బ్యాటరీ, రెండు హై రిజల్యూషన్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్!
Advertisement

Oppo Reno 15C: ఒప్పో తన రెనో సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో, తదుపరి తరం ఫోన్లను త్వరలో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భాగంగా Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మోడల్స్ విడుదల కానున్నాయని Oppo ప్రకటించింది. వీటికి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ సిరీస్‌పై తాజాగా వెలువడిన లీక్స్‌ వినియోగదారుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు మోడల్స్‌తో పాటు రెనో 15 సిరీస్‌లో మరో కొత్త ఫోన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ సూచిస్తున్నాయి. Oppo Reno 15C పేరుతో మరో మోడల్‌ను కంపెనీ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మోడల్‌పై ఒప్పో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, లీక్స్ మాత్రం ఫోన్ స్పెసిఫికేషన్‌లపై స్పష్టత ఇస్తున్నాయి.

మెరుగైన పనితీరు:

Advertisement

ఈ Oppo Reno 15C స్మార్ట్‌ఫోన్‌లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ LTPS OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. పనితీరు పరంగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేయవచ్చని టిప్‌స్టర్లు పేర్కొంటున్నారు. దీనితో పాటు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం.

Also Read: ఇంటినే స్మార్ట్‌గా మార్చే కొత్త డివైస్.. షియోమీ 11 అంగుళాల డిస్‌ప్లే ప్రత్యేకతలు ఇవే!

50MP + 50MP డ్యూయల్ కెమెరాలు:

Advertisement

ఇక కెమెరా విభాగంలో Reno సిరీస్‌కు తగ్గట్టుగా ఈ ఫోన్ మంచి ఫీచర్లతో రానుందని అంచనా. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉండగా, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరా ఇవ్వవచ్చని లీక్స్ చెబుతున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉందని సమాచారం.

7000mAh భారీ బ్యాటరీ:

బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. డిజైన్ విషయానికొస్తే.. ఇది సుమారుగా 8.14mm మందంతో ఉండగా, బరువు 189 గ్రాముల నుంచి 195 గ్రాముల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధర ఎంతంటే?

Oppo Reno 15C స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో సుమారుగా రూ.40 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి రావచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. అయితే ఈ ధరలు, స్పెసిఫికేషన్‌లపై Oppo ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. కాబట్టి.. లాంచ్ సమయంలో కొంత మార్పు ఉండే అవకాశం కూడా ఉంది.

అందుబాటులోకి ఎప్పుడంటే:

ఈ సిరీస్‌ను జనవరి 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Reno 15 ఫోన్ ధర సుమారుగా రూ.50 వేల వరకు ఉండొచ్చని, అదే సమయంలో Reno 15 Pro Mini ఫోన్ రూ.40 వేల ధర రేంజ్‌లో లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

కలర్ ఆప్షన్స్ ఇవే:

డిజైన్ పరంగా ఈ సిరీస్ ఫోన్‌లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించినట్లు సమాచారం. అలాగే Oppo Holofusion టెక్నాలజీ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే, Reno 15 ఫోన్ గ్లేసియర్ వైట్, ట్విలైట్ బ్లూ, అరోరా బ్లూ రంగుల్లో అందుబాటులోకి రావచ్చు. Reno 15 Pro మోడల్ Cocoa బ్రౌన్, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో లభించవచ్చు. అదే విధంగా Reno 15 Pro Moni ఫోన్ Cocoa బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.

Also Read: ఇప్పుడే కొనాలనిపించే డీల్ మావా.. Galaxy A55 5Gపై ఏకంగా రూ.16,900 తగ్గింపు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×