E-Paper
Advertisement

Ai+ Nova Pods: బడ్జెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.వెయ్యి లోపే Ai+ నోవాపాడ్స్ హెల్త్ ట్రాకింగ్ ఇయర్‌బడ్స్!

Ai+ Nova Pods: బడ్జెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.వెయ్యి లోపే Ai+ నోవాపాడ్స్ హెల్త్ ట్రాకింగ్ ఇయర్‌బడ్స్!
Advertisement

Ai+ Nova Pods: కనెక్టెడ్ డివైస్ విభాగంలో తన అడుగులను మరింత బలపరిచే దిశగా Ai+ సంస్థ కీలక ప్రకటన చేసింది. కంపెనీ తన తొలి ఆడియో వేరబుల్స్ శ్రేణిని NovaPods పేరుతో అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు కేవలం ఆడియో వినేందుకు మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్ ఫీచర్లతో రూపొందించబడటం నిజంగా విశేషమనే చెప్పాలి.

రూ.1,000లోపే:

బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సిరీస్‌ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు Ai+ వెల్లడించింది. ప్రారంభ ధరలు రూ.1,000లోపే ఉండనున్నాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఆకట్టుకునే డిజైన్:

Advertisement

నోవాపాడ్స్ శ్రేణి మొత్తం సౌకర్యవంతమైన డిజైన్‌, చెవులకు సరైన ఫిట్‌, మినిమలిస్టిక్ లుక్‌ను కలిగి ఉంటుంది. రోజువారీ వినియోగంలో ఇబ్బంది లేకుండా, దీర్ఘకాలం ధరించినా కంఫర్ట్ కొనసాగించేలా వీటిని డిజైన్ చేసినట్లు Ai+ తెలిపింది. ఆడియో అనుభూతితో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ఈ సిరీస్ ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తోంది.

Also Read: ఎంట్రీ లెవల్ 5Gలో గేమ్ ఛేంజర్.. 6,000mAh బ్యాటరీతో Galaxy A07 5G విడుదల ఎప్పుడంటే?

అనేక వేరియంట్‌లు:

Advertisement

వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని Ai+ నోవాపాడ్స్‌ను పలు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణాల్లో సులభంగా ఉపయోగించుకునేలా తేలికపాటి నిర్మాణంతో NovaPods Go రూపొందించగా, స్టైల్‌తో పాటు శక్తివంతమైన ఆడియో అనుభూతిని కోరుకునే వారికి NovaPods Air అనువుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మరింత ఇమర్సివ్ సౌండ్ కోరుకునే వినియోగదారుల కోసం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో NovaPods Proను పరిచయం చేశారు.

యూజర్లను ఆకట్టుకునేలా:

ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన NovaPods Beats మోడల్‌లో బలమైన బాస్‌తో పాటు హార్ట్‌రేట్ ట్రాకింగ్‌, SpO2 మానిటరింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు, ఓపెన్-ఇయర్ కాన్సెప్ట్‌తో రూపొందించిన NovaPods Clips చుట్టూ ఉన్న వాతావరణంపై అవగాహనను నిలుపుకుంటూనే ఆడియో వినేందుకు వీలుగా రూపొందించబడింది. ఆరోగ్యం, ఫ్యాషన్‌, ఇమర్సివ్ లిసనింగ్‌ను ఒకే ఉత్పత్తిలో కలపాలన్న Ai+ ఆలోచనకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్: 

నోవాపాడ్స్ శ్రేణిలోని అన్ని మోడళ్లు Ai+ స్మార్ట్‌ఫోన్‌లకు అనుగుణంగా, యువతను ఆకట్టుకునే ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా Ai+ స్మార్ట్‌ఫోన్ సీఈఓ, అలాగే Next Quantum Shift Technologies వ్యవస్థాపకుడు మాధవ్ షెత్ మాట్లాడుతూ.. నోవాపాడ్స్ తమ బ్రాండ్ ప్రయాణంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. సాంకేతికతను వినియోగదారుల రోజువారీ జీవితంలో సహజ భాగంగా మార్చడమే తమ లక్ష్యమని, తక్కువ ధరలో సౌకర్యవంతమైన, ఉపయోగకరమైన ఉత్పత్తులను అందించడమే Ai+ దృష్టి అని ఆయన పేర్కొన్నారు.

విడుదల ఎప్పుడంటే?

నోవాపాడ్స్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఖచ్చితమైన ధర వివరాలను ఆవిష్కరణకు ముందు ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఆడియో వేరబుల్స్ 2026 జనవరిలో ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 35 గంటల వినియోగం.. న్యూ ఇయర్ కానుకగా షియోమీ బడ్స్ 6 లాంచ్‌!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×