E-Paper
Advertisement

ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. iPhone 19ను స్కిప్ చేసి నేరుగా iPhone 20 లాంచ్!

ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. iPhone 19ను స్కిప్ చేసి నేరుగా iPhone 20 లాంచ్!
Advertisement

iPhone 20 Leaks: ఐఫోన్ 18 మార్కెట్లోకి రావడానికి ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. కానీ అప్పుడే iPhone 20 గురించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా fpt. అనే యూట్యూబ్ ఛానెల్ ఐఫోన్ 20కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ వీడియోను షేర్ చేసింది. ఇది ఐఫోన్ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజైన్ మార్పులతో రాబోతోందని ఈ లీక్స్ చూస్తే అర్థమవుతోంది.

నేరుగా iPhone 20 వైపేనా?

సాధారణంగా యాపిల్ ఫోన్ల పేర్ల క్రమాన్ని బట్టి చూస్తే.. వచ్చే ఏడాది iPhone 18, ఆపై ఏడాది iPhone 19 రావాలి. కానీ 2027 నాటికి ఐఫోన్ వచ్చి సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఈ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి యాపిల్ సంస్థ iPhone 19ను స్కిప్ చేసి, నేరుగా iPhone 20ని పరిచయం చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. గతంలో ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా iPhone 9ను వదిలేసి, నేరుగా iPhone Xను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

Also Read: ఈ లుక్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే.. క్రేజీ కలర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Motorola కొత్త ఫోన్!

అద్భుతమైన కర్వ్‌డ్ డిజైన్:

ప్రస్తుతం బయటకు వచ్చిన రెండర్ల ప్రకారం.. iPhone 20 స్క్రీన్ చుట్టూ అంచులు (బెజెల్స్) దాదాపు కనిపించవు. ఫోన్ ముందు భాగం, వెనుక భాగం మొత్తం గ్లాస్‌తోనే కప్పబడి ఉంటుంది. నాలుగు వైపులా కొద్దిగా వంగి ఉండే క్వాడ్ కర్వ్‌డ్ డిజైన్‌ను దీనిలో వాడబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం యాపిల్ సంస్థ శాంసంగ్‌తో కలిసి సరికొత్త డిస్‌ప్లేపై పనిచేస్తోందని సమాచారం.

డైనమిక్ ఐలాండ్, బటన్స్ మాయం:

Advertisement

ఈ కొత్త మోడల్‌లో స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ ఇకపై కనిపించకపోవచ్చు. ఫేస్ ఐడీ, ఫ్రంట్ కెమెరా రెండూ స్క్రీన్ లోపలే (అండర్ డిస్‌ప్లే) దాగివుంటాయి. అంతేకాదు.. ఫోన్‌కు ఇరువైపులా ఉండే వాల్యూమ్, పవర్ ఫిజికల్ బటన్స్ కూడా ఉండవు. వాటి స్థానంలో వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే టచ్ కంట్రోల్స్ రాబోతున్నాయి.

పవర్‌ఫుల్ ఫీచర్లు, సవాళ్లు:

డిజైన్‌తో పాటు హార్డ్‌వేర్ పరంగానూ iPhone 20 నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుంది. దీనిలో అత్యంత వేగవంతమైన 2nm A21 చిప్‌సెట్, 200MP ప్రైమరీ కెమెరా, సరికొత్త సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కర్వ్‌డ్ స్క్రీన్ అంచుల వద్ద బ్రైట్‌నెస్ తగ్గకుండా చూడటం, స్క్రీన్ కింద ఉండే కెమెరా క్వాలిటీ తగ్గకుండా మెయింటైన్ చేయడం సంస్థ ముందున్న ప్రధాన సవాళ్లు. ప్రస్తుతం శాంం‌సంగ్, ఎల్‌జీ సంస్థలతో కలిసి యాపిల్ ఈ సాంకేతిక సమస్యలను అధిగమించే పనిలో ఉంది.

Also Read: జస్ట్.. రూ.51కే అన్‌లిమిటెడ్ కాల్స్, 60GB డేటా.. BSNL యూజర్ల కోసం అదిరిపోయే ఫ్రీడమ్ ప్లాన్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×