E-Paper
Advertisement

ఈ లుక్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే.. క్రేజీ కలర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Motorola కొత్త ఫోన్!

ఈ లుక్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే.. క్రేజీ కలర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Motorola కొత్త ఫోన్!
Advertisement

Motorola Edge 70 Pro Plus: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా కంపెనీ భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడానికి సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న Edge 70 సిరీస్‌లో భాగంగా Motorola Edge 70 Pro Plus స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక మైక్రోసైట్ వివరాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రీమియం లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్ కోసం యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కళ్లుచెదిరే పాంటోన్ డిజైన్:

ఈ Motorola Edge 70 Pro Plus డిజైన్ విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా మూడు విభిన్నమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది. చికోరీ కాఫీ వేరియంట్ క్లాసిక్ ఉడెన్ ఫినిషింగ్‌తో, స్టార్మీ సీ వేరియంట్ ఒక రకమైన ఫ్యాబ్రిక్ టెక్స్చర్‌తో రానుంది. అలాగే జిన్‌ఫాండెల్ ఎడిషన్ సాఫ్ట్ శాటిన్ లుక్‌తో ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. కర్వ్‌డ్ డిస్‌ప్లే, సెంటర్ పంచ్‌హోల్ కెమెరాతో దీని లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: ChatGPTతో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్స్.. ఈ సింపుల్ ట్రిక్‌ తెలిస్తే చిటికెలో రెడీ!

50x జూమ్ ఫీచర్‌:

ఇందులో వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ప్రధానంగా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 710 సెన్సార్‌ను అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది కాబట్టి.. తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. అంతేకాకుండా.. 50x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే సూపర్ జూమ్ ప్రో టెక్నాలజీ కూడా ఇందులో ఉండటం విశేషం.

మెరుగైన పోర్ట్రెయిట్ షాట్స్:

Advertisement

ఈ ఫోన్‌లో 81mm ఫోకల్ లెంగ్త్ కలిగిన టెలిఫోటో కెమెరాను ఇస్తున్నట్లు సమాచారం. దీనివల్ల దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడంతో పాటు, ప్రొఫెషనల్ రేంజ్ పోర్ట్రెయిట్ షాట్స్ తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. 16GB వరకు RAM సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్:

స్టైల్, పర్ఫార్మెన్స్, బడ్జెట్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఒక ఫ్లాగ్‌షిప్ అనుభూతిని పొందాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ మోటోరోలా ఈ ఫోన్‌ను తెస్తోంది. కంపెనీ ఇంకా దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. సోషల్ మీడియా టీజర్లు చూస్తుంటే అతి త్వరలోనే ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది.

Also Read: లైకా కెమెరాలు, వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో రంగంలోకి Xiaomi 17T.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×