BigTV English

YSRCP: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు

YSRCP: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు

తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి.. కల్తీ అయ్యిందనే ఆరోపణలు టీడీపీ, వైసీపీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక అదే అంశంపై శుక్రవారం నాడు వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఏపీ పోలీటిక్స్ వేరె లెవల్ అని చెప్పాలి.

100రోజుల పాలన గురించి మాట్లాడే ధైర్యం లేక చంద్రబాబు లడ్డూ వివాదం తెరపైకి తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. లడ్డూ వివాదంలో కూడా తప్పులు బయటపడుతుంటే డిక్లరేషన్ అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇస్తే.. ఏదో ఒక మతానికి చెందిన నాయకుడిగా ఆయనపై ముద్ర పడుతుందని.. అది తమకు ఇష్టంలేదని వైసీపీ వాదన. తమ అధినేత ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని.. అన్ని వర్గాలను సమానంగా చూస్తారని.. అందుకే డిక్లరేషన్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.


Also Read: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

గతంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారని.. అప్పుడు లేని డిక్లరేషన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకుంటే బాగుండేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. పర్యటనను రద్దు చేసుకోవడం అంటే.. హిందువుల మనోభావాలను, శ్రీవారిని అవమానించినట్టేనని అంటున్నారు. అయితే… జగన్ విమర్శలకు చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. తప్పుు చేసి తప్పించుకోవడం జగన్ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లి తప్పు చేసి ఇప్పుడు దాన్ని సమర్ధించుకోవడం ఏంటని ప్రశ్నించారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×