E-Paper
Advertisement

iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

iPhone Fold Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చినా.. యాపిల్ మాత్రం ఆ జోలికి వెళ్లలేదు. కానీ ఈ ఏడాది ఆ నిరీక్షణకు తెరపడనుంది. యాపిల్ తమ మొదటి మడత ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి iPhone Fold లేదా iPhone Ultra అని పేరు పెట్టే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన డమ్మీ మోడల్స్ ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంతో.. ఈ సరికొత్త డిజైన్ ఎలా ఉండబోతుందో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది.

పాస్‌పోర్ట్ సైజ్ డిజైన్:

తాజాగా లీకైన వివరాల ప్రకారం..ఈ ఐఫోన్ చూడటానికి వెడల్పుగా, ఒక చిన్న పాస్‌పోర్ట్ సైజులో భలే ముచ్చటగా ఉంది. దీని వెనుక భాగంలో అడ్డంగా అమర్చిన పిల్‌ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో రెండు కెమెరాలు ఉంటాయి. అలాగే, ఎప్పుడూ ఫోన్ పక్కన ఉండే వాల్యూమ్ బటన్లను ఈసారి ఫోన్ పైభాగానికి మార్చడం విశేషం. పవర్ బటన్ మాత్రం ఎప్పటిలాగే పక్కనే ఉంటుంది. ఈ ఫోన్‌ను యాపిల్ కేవలం వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐప్యాడ్ మినీ రేంజ్ డిస్‌ప్లే:

Advertisement

ఈ ఫోల్డబుల్ ఐఫోన్ లోపలి స్క్రీన్ 7.8 ఇంచుల భారీ OLED డిస్‌ప్లేతో రానుంది. అంటే ఇది దాదాపు ఐప్యాడ్ మినీ సైజులో ఉంటుంది. మడత ఫోన్లలో సాధారణంగా కనిపించే స్క్రీన్ క్రీజ్ (మడత గీత) చాలా తక్కువగా ఉండేలా యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక ఫోన్ మూసి ఉన్నప్పుడు బయట వైపు 5.5 ఇంచుల స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫేస్ ఐడీకి బదులుగా, పవర్ బటన్‌కే టచ్ ఐడీ (ఫింగర్‌ప్రింట్) ఇస్తున్నట్లు సమాచారం.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy A35 5Gపై రూ.14,000 తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు దొరుకుతోందంటే?

అద్భుతమైన ఫీచర్లు:

Advertisement

మడత విప్పినప్పుడు కేవలం 4.7 మిమీ మందం ఉండే ఈ ఫోన్.. మార్కెట్లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా నిలవనుంది. దీనిలో 48MP ప్రైమరీ కెమెరాతో పాటు, 2nm ప్రాసెస్ ఆధారంగా పనిచేసే పవర్‌ఫుల్ A20 ప్రో చిప్‌సెట్ వాడనున్నారు. 12GB RAM, 1TB వరకు స్టోరేజ్, అలాగే ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్దదైన 5,800mAh బ్యాటరీని ఇందులో అమర్చబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఐఓఎస్ 27 (iOS 27) సాఫ్ట్‌వేర్ మల్టీటాస్కింగ్‌ను మరింత సులభం చేయనుంది.

ధర ఎంత? లాంచ్ ఎప్పుడు?

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఈ ఐఫోన్ ఫోల్డ్‌ను కూడా లాంచ్ చేయవచ్చని అంచనా. అమెరికా మార్కెట్లో దీని ధర సుమారు దాదాపు రూ.1,91,000 నుండి రూ.2,29,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Also Read: రూ.500 లోపు బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. వైర్‌లెస్ కంటే క్లియర్ సౌండ్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్!

Related News

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

యాపిల్ లేటెస్ట్ ఫీచర్.. ఐఫోన్‌లో కొత్త Siri AI డిజైన్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్

రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×