E-Paper
Advertisement

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..
Advertisement

iPhone16 series: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫోన్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి సంబందించి ఏదైనా కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతారు మొబైల్ లవర్స్. కొత్త కొత్త ఫీచర్స్‌తో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.. వస్తూనే వుంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే మొబైల్ రంగంలో ట్రెండ్ క్రియేట్ చేయడమన్నమాట.

ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల అమ్మకాలు మొదలయ్యాయి.  ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్స్ 15 నుంచి 20 గంటల పాటు క్యూలో ఉన్నారు. చివరకు ఆ ఫోన్ ను సొంతం చేసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Advertisement

ఇండియాలోని ముంబై, ఢిల్లీ, సూరత్ వంటి నగరాల్లో యాపిల్ స్టోర్ల ముందు మొబైల్ లవర్స్ పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఇండియాలో సెప్టెంబరు (20న)మూడో వారంలో ఆ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోకి బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద ప్రజలు బారులు తీరారు. ఏడాది కిందట ఇక్కడ ఆ కంపెనీ స్టోర్‌ని ప్రారంభించిన విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఆపిల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ఆధారంగా దీన్ని రూపొందించింది ఆ కంపెనీ. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16 ప్రారంభం ధర (రూ. 79,900), ఐఫోన్ 16 ప్లస్ (రూ.89,900), ఐఫోన్ 16 ప్రొ (రూ.1,19,900), ఐఫోన్ 16 ప్రొ మాక్స్ (రూ.1,44,900)వంటి నాలుగు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా జోడించిన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ ఉన్నాయి. అంతేకాదు కొత్తగా రూపొందించిన ఏ 18 చిప్‌ను అందిస్తున్నారు.

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×