BigTV English

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Moto G85 5G New Colour: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలాది ప్రత్యేక శైలి. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడన్నీ 5జీ ఫోన్లు భారీ ధరలో రిలీజ్ చేస్తూంటే మోటో మాత్రం బడ్జెట్ ఫోన్లు ఒకవైపు, ప్రీమియం ఫోన్లు మరోవైపు రిలీజ్ చేస్తూ హవా చూపిస్తోంది. ఇక ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో Moto G85 5G ఒకటి. ఈ ఏడాది జూలైలో ఈ ఫోన్ భారతదేశంలో మూడు కలర్‌ వేరియంట్లలో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన మరో కలర్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది.


ఇప్పుడు ఈ ఫోన్ కొత్త మెజెంటా కలర్ ఆప్షన్‌లో వచ్చేలా కంపెనీ టీజర్ రిలీజ్ చేసింది. అయితే కొత్త వేరియంట్ లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో మరో సర్‌ప్రైజ్ అందింది. ఈ హ్యాండ్‌సెట్ కొత్త గ్రీన్ కలర్ ఆప్షన్‌లో కూడా వస్తుందని ఓ నివేదిక సూచించింది. ఈ రెండు కొత్త కలర్ వేరియంట్లు రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ప్రారంభించబడతాయని తెలుస్తోంది. కాగా Moto G85 5G ఫోన్ మొదట జూన్‌లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో ఆవిష్కరించబడింది. ఇది వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో IP52-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.

Moto G85 5G New Colour Variants


Also Read: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ కొత్త కలర్‌ వేరియంట్ల విషయానికొస్తే.. ఇది Viva Magenta కలర్‌లో లాంచ్ చేయబడుతుంది. రాబోయే వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌లో కనిపించింది. దీంతోపాటు మోటరోలా ఇండియా సైట్‌లో కూడా కనిపిస్తుంది. ఇ-కామర్స్ సైట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్ ప్రకారం.. ‘‘త్వరలో వస్తుంది’’ అని ఉంది. కానీ ఖచ్చితమైన ప్రారంభ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే అధికారిక X పోస్ట్‌లో ఈ ఫోన్ న్యూ వివా మెజెంటా వేరియంట్‌ను రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఆవిష్కరించవచ్చని సూచిస్తుంది. అయితే Moto G85 5G కూడా కొత్త గ్రీన్ కలర్‌లో లాంచ్ అవుతుందని పేర్కొంది.

ఈ ఫోన్ ప్రస్తుతం కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే అనే మూడు షేడ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలివ్ గ్రీన్ వేరియంట్‌లో కొత్త గ్రీన్ షేడ్ డార్క్ కలర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ డార్క్ గ్రీన్ కలర్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ఇదే నిజం అయితే డార్క్ గ్రీన్ కలర్ ఐదవ ఆప్షన్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు కలర్ ఆప్షన్‌లు ఇప్పటికే ఉన్న వేరియంట్‌ల మాదిరిగానే ఇది వేగన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి.

Moto G85 5G Specifications

Moto G85 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల 120Hz ఫుల్-HD+ 3D కర్వ్డ్ పోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సి కోసం ఇది IP52-రేటెడ్ బిల్డ్‌ని కలిగి ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.

Moto G85 5G price

Motorola భారతదేశంలో Moto G85 5Gని రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. అందులో 8GB + 128GB వేరియంట్ రూ.17,999 ధరతో లాంచ్ అయింది. అలాగే 12GB + 256GB వేరియంట్ రూ. 19,999 ధరతో అందుబాటులోకి వచ్చింది.

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×